IPL 2021: ఐపీఎల్‌ ఫేజ్‌-2 షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

తాజా వార్తలు

Updated : 26/07/2021 01:09 IST

IPL 2021: ఐపీఎల్‌ ఫేజ్‌-2 షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ అభిమానులకు శుభవార్త. భారత్‌లో కరోనా వల్ల వాయిదా పడిన ఐపీఎల్‌-14 సీజన్‌ మ్యాచ్‌లు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఐపీఎల్‌-14 ఫేజ్‌-2 షెడ్యూల్‌ ను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు ఐపీఎల్‌ ఫేజ్‌-2 క్రికెట్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్‌ వేదికగా ఇప్పటికే ఐపీఎల్‌-14వ సీజన్‌లో 29 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మిగతా మ్యాచ్‌లు యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్టు బీసీసీఐ తెలిపింది. సీఎస్‌కే, ముంబయి మధ్య పోరుతో ఫేజ్‌-2 మ్యాచ్‌ మొదలుకానుంది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 10న మొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. అక్టోబరు 11న ఎలిమినేటర్‌, 13న రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌, అక్టోబరు 15న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

 

 

 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని