Parthiv Patel: ఎంఎస్‌ ధోనీ కాదు.. నేను బాగా ఆడకపోవడం వల్లే తొలగించారు

తాజా వార్తలు

Published : 24/07/2021 01:11 IST

Parthiv Patel: ఎంఎస్‌ ధోనీ కాదు.. నేను బాగా ఆడకపోవడం వల్లే తొలగించారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియాలో చోటు కోల్పోవడానికి ఎంఎస్‌ ధోనీ కారణం కాదని మాజీ వికెట్‌కీపర్ పార్థివ్‌ పటేల్‌ అంటున్నాడు. అతడితో సమాంతరంగా కెరీర్‌ ఉండటం పట్ల బాధపడటం లేదని స్పష్టం చేశాడు. నిజానికి మహీ కన్నా ముందే తాను అరంగేట్రం చేశానని వెల్లడించాడు.

‘నిజాయతీగా చెబుతున్నా. ధోనీతో సమాంతరంగా కెరీర్‌ ఉండటం దురదృష్టంగా భావించను. నిజానికి టీమ్‌ఇండియాలో నేనే ముందుగా అరంగేట్రం చేశాను. నా ప్రదర్శన అంతర్జాతీయ స్థాయిలో లేకపోవడంతోనే చోటు కోల్పోయాను. అవకాశాలు వచ్చినా నన్ను నేను నిరూపించుకోలేదు. అప్పుడు మహీ వచ్చాడు. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఆడకపోవడం దురదృష్టంగా భావించను. ఎందుకంటే అప్పటికే నేను 19 టెస్టులు ఆడాను. మరిన్ని అవకాశాలు రాలేదనీ చెప్పను. 19 టెస్టులంటే చాలా ఎక్కువే’ అని పార్థివ్‌ పటేల్‌ అన్నాడు.

పార్థివ్‌ పటేల్‌ 2002లోనే టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే అనుకున్న స్థాయిలో రాణించలేదు. అదే సమయంలో మహీ కనిపించాడు. అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టాడు. అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగాడు. కీపింగ్‌, బ్యాటింగ్‌, కెప్టెన్సీలో తనదైన ముద్ర వేశాడు. దాంతో పార్థివ్‌, దినేశ్‌ కార్తీక్‌ ఎక్కువ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేక పోయారు. 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడిన పార్థివ్‌ కొన్ని నెలల క్రితమే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని