Delhi Capitals: దుబాయ్‌కి చేరుకున్న దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లు

తాజా వార్తలు

Published : 12/09/2021 14:42 IST

Delhi Capitals: దుబాయ్‌కి చేరుకున్న దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లు

(Photo: Delhi Capitals twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు రద్దవ్వడంతో భారత ఆటగాళ్లు దుబాయ్‌ బాటపట్టారు. వచ్చేవారం నుంచి ఐపీఎల్‌ 14వ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు తమ ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసిన విమానాల్లో అక్కడికి చేరుకుంటున్నారు. ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ,  జస్ప్రిత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌ శనివారమే ప్రత్యేక విమానంలో దుబాయ్‌కి చేరుకోగా.. ఆదివారం ఉదయం దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లు వచ్చారు.

దిల్లీ జట్టులో రిషభ్‌ పంత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అజింక్య రహానె, ఇషాంత్‌ శర్మ, అక్షర్‌ పటేల్‌, పృథ్వీషా, ఉమేశ్‌ యాదవ్‌ ఉన్నారు. వీరంతా దుబాయ్‌లో అడుగుపెట్టగానే కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే, అక్కడి నిబంధనల ప్రకారం ఈ ఆటగాళ్లంతా ఆరు రోజులు ప్రత్యేక క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాతే తమ జట్లతో కలిసే వీలుంది. మరోవైపు విదేశీ ప్లేయర్లు ఇప్పటికే యూఏఈకి చేరుకొని ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. దిల్లీ క్యాపిటల్స్‌ బృందం కూడా ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈసారి కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా జట్టుతో కలిసిపోయాడు. ఏప్రిల్‌లో జరిగిన సీజన్‌లో భుజం గాయం కారణంగా అతడు ఆడని సంగతి తెలిసిందే. అప్పుడు రిషభ్‌ పంత్‌ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును విజయ పథంలో నడిపించాడు. ఈ క్రమంలోనే టోర్నీ నిలిచిపోయేసరికి జట్టును టాప్‌లో నిలిపాడు. ఇక మిగిలిన సీజన్‌లోనూ దిల్లీ ఇలాంటి ప్రదర్శనే చేసి తొలిసారి కప్పు ఎగరేసుకుపోవాలని చూస్తోంది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని