కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌

తాజా వార్తలు

Published : 27/04/2021 12:36 IST

కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌

బరిలో భారత్‌ సహా 8 జట్లు: ఐసీసీ

దుబాయ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లోకి క్రికెట్‌ పునరాగమనం చేయబోతోంది. 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల మహిళ క్రికెట్లో 8 జట్లు బరిలో దిగుతాయని ఐసీసీ ప్రకటించింది. టీ20 ఫార్మాట్‌లో జరిగే టోర్నీలో ఆతిథ్య ఇంగ్లాండ్‌, టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికాతో పాటు కరీబియన్‌ దీవుల నుంచి ఒక జట్టు అర్హత సాధించినట్లు వెల్లడించింది.

ఏప్రిల్‌ 1 వరకు ఉన్న ర్యాంకింగ్స్‌ ఆధారంగా ఆయా జట్లను ఐసీసీ ఎంపిక చేసింది. వచ్చే ఏడాది జనవరిలో క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా 8వ జట్టును ఎంపిక చేయనున్నట్లు ఐసీసీ పేర్కొంది. 1998 కౌలాలంపూర్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌ను చేర్చారు. ఆ క్రీడల్లో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. అనంతరం కామన్వెల్త్‌ క్రీడలకు క్రికెట్‌ దూరంగా ఉంది.

‘‘కరీబియన్‌ దీవుల నుంచి ఏ జట్టు బరిలో ఉంటుందన్నది అర్హత టోర్నీ ద్వారా నిర్ణయిస్తాం. కరీబియన్‌ మహిళా క్రికెటర్లు తమ దేశాల తరఫున ఆడుతున్నారు. 2022 జనవరిలో జరిగే అర్హత టోర్నీ ద్వారా 8వ జట్టును ప్రకటిస్తాం’’ అని ఐసీసీ పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని