ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ రద్దు

తాజా వార్తలు

Published : 27/04/2021 13:25 IST

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ రద్దు

 

దిల్లీ: కరోనా కారణంగా అజర్‌బైజాన్‌లోని బాకులో జరగాల్సిన షూటింగ్‌ ప్రపంచకప్‌ రద్దయింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన షూటర్లకు మంచి సన్నాహకంగా భావించిన ఈ టోర్నీ జూన్‌ 21 నుంచి జులై 2 వరకు జరగాల్సింది. కానీ తమ దేశంలో వైరస్‌ కేసులు పెరుగుతుండడంతో బాకులో షూటింగ్‌ ప్రపంచకప్‌ టోర్నీని నిర్వహించడం సురక్షితం కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్‌ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌)కు అజర్‌బైజాన్‌ షూటింగ్‌ సమాఖ్య (ఏఎస్‌ఎఫ్‌) తెలిపింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని