తుపాకులు తీసుకెళ్లేందుకు అన్ని అనుమతులున్నా..

తాజా వార్తలు

Published : 20/02/2021 09:48 IST

తుపాకులు తీసుకెళ్లేందుకు అన్ని అనుమతులున్నా..

దిల్లీ: శిక్షణ కోసం వెళుతున్న తనను విమానాశ్రయ అధికారులు అకారణంగా ఆపి నేరస్తురాలిలా చూశారని భారత యువ షూటర్‌ మను బాకర్‌ ఆరోపించింది. భోపాల్‌ వెళుతుండగా ఆమెను దిల్లీ విమానాశ్రయంలో అడ్డుకున్న అధికారులు రూ.10,200 సుంకం విధించారు. తుపాకులు తీసుకెళ్లేందుకు తన దగ్గర అన్ని అనుమతి పత్రాలూ ఉన్నా కూడా సిబ్బంది వినలేదని.. ఆమె కేంద్ర క్రీడల మంత్రి కిరెన్‌ రిజిజు, విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరికి ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. అయితే బాకర్‌ ట్విట్లకు వెంటనే స్పందించిన మంత్రులు ఆమె వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. రిజిజు, హర్‌దీప్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాకర్‌.. విమానాశ్రయ అధికారులు క్రీడాకారులను గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ అవమానించొద్దని పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని