అర్జున్‌ ఈ ఘనత నీది.. ఎవరూ తీసుకుపోలేరు 

తాజా వార్తలు

Updated : 19/02/2021 17:06 IST

అర్జున్‌ ఈ ఘనత నీది.. ఎవరూ తీసుకుపోలేరు 

సోదరుడికి సారా తెందూల్కర్‌ అభినందనలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ను ముంబయి ఇండియన్స్‌ గతరాత్రి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కనీస ధర రూ.20లక్షలకు ముంబయి ఫ్రాంఛైజీ అతడిని  సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సారా తెందూల్కర్‌ తన సోదరుడిని అభినందించింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అర్జున్‌ బౌలింగ్‌ చేస్తున్న ఫొటోను పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది.

‘నువ్వు సాధించిన ఈ ఘనతను.. నీ నుంచి ఎవరూ తీసుకోలేరు. ఇది నీది. క్రికెట్‌ నీ రక్తంలోనే ఉంది. ఇన్నాళ్లూ నెట్స్‌లో సాధన చేసి మేటి క్రికెటర్‌గా ఎదిగాడు. ఇప్పుడిక 22 గజాలపై తుఫాన్‌ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు’ అని సారా పేర్కొంది. అర్జున్‌ సహజంగా లెఫ్టార్మ్‌ పేసర్‌, బ్యాట్స్‌మన్‌ కావడంతో తీసుకున్నామని ఆ ఫ్రాంఛైజీ యజమాని ఆకాశ్‌ అంబానీ గతరాత్రి ఓ వీడియోలో పేర్కొన్నారు. మరోవైపు అర్జున్‌ ఇటీవల ముంబయి సీనియర్స్‌ జట్టు తరఫున సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆడిన సంగతి తెలిసిందే. దీంతో అతడికి ఐపీఎల్‌ వేలంలో పాల్గొనే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలోనే 14వ సీజన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అతడిని ముంబయి కనీస ధరకే చేజిక్కించుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని