PV Sindhu: అమూల్‌ పీవీ ‘విన్‌’దు  కార్టూన్‌ చూశారా!

తాజా వార్తలు

Updated : 02/08/2021 20:12 IST

PV Sindhu: అమూల్‌ పీవీ ‘విన్‌’దు  కార్టూన్‌ చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం.. ఇలా వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన పీవీ సింధుపై యావత్‌ దేశమంతా.. ప్రశంసల జల్లు కురిపిస్తోంది. తాజాగా పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ ఆమెని అభినందిస్తూ.. అమూల్‌ స్టైల్‌లో పీవీ సింధు కార్టూన్‌ని విడుదల చేసింది.  ఓ చేత్తో.. మెడలో కాంస్య పతకం .. మరో చేత్తో బ్యాడ్మింటన్‌ రాకెట్‌ని పట్టుకొని దర్శనమిస్తున్న ఈ చిత్రానికి.. పీవీ ‘విన్‌’దు అనే క్యాషన్‌ను జతచేశారు. ఇటీవల రజత పతకాన్ని భారత్‌కు అందించిన మీరాచానుకు..  విజయానికి గుర్తుగా మీరా మెడలో రజతం, ఎదురుగా బార్‌బెల్‌ ముందు నిలబడ్డ ఓ కార్టూన్‌ను అమూల్‌ సంస్థ విడుదల చేసింది .  ‘‘మేరా, తేరా, హమారా ఫేవరేట్‌ స్నాక్‌’’ (నాది, మీది, మనందరికి ఇష్టమైన స్నాక్‌) అంటూ క్యాప్షన్‌ను జత చేసింది. ప్రస్తుతం భారతీయ ప్రజల దృష్టంతా తొలిసారి సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళల హాకీ జట్టుపైనే ఉంది. ఎలాగైనా సెమీస్‌లోనూ అర్జెంటీనాను ఓడించి పతకం సాధిస్తుందని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు.




Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని