KKR Vs PBKS:అదరగొట్టిన కేఎల్ రాహుల్‌‌.. కోల్‌కతాపై పంజాబ్ కింగ్స్ విజయం

తాజా వార్తలు

Updated : 01/10/2021 23:57 IST

KKR Vs PBKS:అదరగొట్టిన కేఎల్ రాహుల్‌‌.. కోల్‌కతాపై పంజాబ్ కింగ్స్ విజయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (67; 55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మయాంక్‌ అగర్వాల్‌ (40; 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో కోల్‌కతా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఛేదించింది. చివర్లో షారూక్‌ ఖాన్‌ (22; 9 బంతుల్లో ఒక ఫోర్‌, రెండు సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. దీపక్‌ హుడా (3) నిరాశపర్చగా.. నికోలస్‌ పూరన్ (12), మార్‌క్రమ్‌ (18) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు, నరైన్‌, వెంకటేశ్ అయ్యర్, శివమ్‌ మావి తలో వికెట్‌ పడగొట్టారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్‌ ఐదో స్థానానికి ఎగబాకింది. కేఎల్‌ రాహుల్ ‘మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏడు  వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (67; 49 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకంతో అదరగొట్టగా.. నితీశ్ రాణా (31; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి (34; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. కేకేఆర్‌కు మూడో ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. శుభ్‌మన్‌ గిల్‌ (7)ను అర్ష్‌దీప్‌ సింగ్‌  క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అనంతరం రాహుల్‌ త్రిపాఠితో కలిసి వెంకటేశ్ అయ్యర్‌ ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టాడు. వీరిద్దరూ నిలకడగా పరుగులు చేసి స్కోరు బోర్డుని ముందుకు కదిలించారు. ఈ క్రమంలో రవి బిష్ణోయ్‌ వేసిన 11.3 బంతికి  రాహుల్ త్రిపాఠి.. దీపక్‌ హుడాకి  క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరగా.. ధాటిగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్‌ కూడా బిష్ణోయ్‌ వేసిన  14.4 బంతికి ఔటయ్యాడు. మోర్గాన్‌(2) నిరాశపర్చాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన 18వ ఓవర్‌లో ఫోర్‌, సిక్స్‌ బాదిన నితీశ్ రాణా..  నాలుగో బంతికి మయాంక్‌ అగర్వాల్‌ చేతికి చిక్కాడు. చివరి ఓవర్‌లో ఆఖరి బంతికి దినేశ్ కార్తీక్‌ (11) ఔటయ్యాడు. నరైన్‌ (3) నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌ తలో రెండు వికెట్లు, షమి ఒక వికెట్‌  తీశారు. నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు, రవి బిష్ణోయ్‌ రెండు వికెట్లు, షమి ఒక వికెట్‌  తీశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని