close
Array ( ) 1

తాజా వార్తలు

న్యూజిలాండ్‌దే తొలి టెస్టు

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి ఓటమి

వెల్లింగ్టన్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత జట్టుకు న్యూజిలాండ్‌ చెక్‌పెట్టింది. తొలి టెస్టులో టీమ్‌ఇండియాను పది వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌లో బోణీ కొట్టింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్‌ 1-0 ఆధిక్యం సాధించింది. సోమవారం నాలుగో రోజు 144/4 వద్ద రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమ్‌ఇండియా.. మరో నాలుగు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానె(29; 75 బంతుల్లో 5x4), హనుమ విహారి(15; 79 బంతుల్లో 2x4) వెనువెంటనే ఔటయ్యారు. తర్వాత రిషభ్‌ పంత్‌(25), రవిచంద్రన్‌ అశ్విన్‌(4), ఇషాంత్‌ శర్మ(12), మహ్మద్‌ షమి(2), జస్ప్రీత్‌ బుమ్రా (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 183 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో మరో తొమ్మిది పరుగులు చేసి ఆ జట్టు విజయం సాధించింది. 

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆటౌటైంది. అనంతరం కివీస్‌ 348 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు 183 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ లోటును భర్తీ చేసే క్రమంలో టీమ్‌ఇండియా ఆదివారం నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పృథ్వీషా(14), ఛెతేశ్వర్‌ పుజారా(11), కోహ్లీ(19) విఫలమైనా మయాంక్‌ అగర్వాల్‌(58; 99 బంతుల్లో 7x4, 1x6) ఒక్కడే పట్టుదలగా ఆడాడు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ(5), ట్రెంట్‌ బౌల్ట్‌(4), కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌(1) వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో సైతం నాలుగు వికెట్లు తీసిన సౌథీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 165 ఆలౌట్‌; అజింక్య రహానె(46), కైల్‌ జేమీసన్‌ 4/39, టిమ్‌సౌథీ 4/49

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 348 ఆలౌట్‌; కేన్‌ విలియమ్సన్‌(89), ఇషాంత్‌ శర్మ 5/68, అశ్విన్‌ 3/99

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 191 ఆలౌట్‌; మయాంక్‌ అగర్వాల్‌(58), టిమ్‌ సౌథీ 5/61, ట్రెంట్‌ బౌల్ట్‌ 4/39

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 9-0; టామ్‌ లాథమ్‌ (7), బ్లండెల్‌ (2)


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.