close

తాజా వార్తలు

Updated : 25/10/2020 21:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హార్దిక్‌ పవర్‌ టచ్‌: రాజస్థాన్‌ లక్ష్యం 196

అబుదాబి: తొలి బ్యాటింగైనా.. ఛేదననైనా ముంబయి ఒకే జోరు కనబరుస్తోంది. అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్‌ ముందు 196 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసినా హార్దిక్‌ పాండ్య (60*; 21 బంతుల్లో 2×4, 7×6) సూర్యకుమార్‌ యాదవ్‌ (40; 26 బంతుల్లో 4×4, 1×6), ఇషాన్‌ కిషన్‌ (37; 36 బంతుల్లో 4×4, 1×6), సౌరభ్‌ తివారి (33*; 23 బంతుల్లో 4×4, 1×6) బ్యాటింగ్‌లో రాణించారు. శ్రేయస్‌ గోపాల్‌ 2 వికెట్లు తీశాడు.

సూర్య.. అదే జోరు

ముంబయి 7 పరుగుల వద్దే డికాక్‌ (6) వికెట్‌ చేజార్చుకున్నా దాని జోరేమీ తగ్గలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌, మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ రెచ్చిపోయారు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదేసి 10 ఓవర్లకు జట్టును 89/1తో నిలిపారు. రెండో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని కిషన్‌ను ఔట్‌ చేయడం ద్వారా త్యాగి విడదీశాడు. అప్పుడు స్కోరు 90/2. అర్ధశతకం చేసిన సూర్య, అప్పుడే వచ్చిన కెప్టెన్‌ పొలార్డ్‌ను శ్రేయస్‌ గోపాల్‌ 13వ ఓవర్లో పెవిలియన్‌ పంపించాడు.

పాండ్య.. పవర్‌ నాక్‌

వరుసగా రెండు వికెట్లు చేజార్చుకోవడంతో ముంబయి రన్‌రేట్‌ కాస్త తగ్గినట్టు అనిపించినా హార్దిక్‌ పాండ్యతో కలిసి సౌరభ్‌ తివారి మంచి షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో అంకిత్‌ రాజ్‌పుత్‌ వేసిన 18వ ఓవర్‌ను హార్దిక్‌ లక్ష్యంగా ఎంచుకున్నాడు. నాలుగు సిక్సర్లు బాదేసి 138/4గా ఉన్న స్కోరును ఓవర్‌ వ్యవధిలో  165/4కి చేర్చాడు. 19వ ఓవర్లో తివారిని ఔట్‌ చేసిన జోఫ్రా 3 పరుగులే ఇచ్చినా.. ఆఖరి ఓవర్లో పాండ్య మరింత భీకరంగా ఆడాడు. 6, 4, 4, 6, 6తో జట్టు స్కోరును 195/5కు తీసుకెళ్లాడు. పాండ్య దెబ్బకు ముంబయి ఆఖరి 4 ఓవర్లలో 60 పరుగులు రాబట్టింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.