కోహ్లీ ఆడినంత కాలం.. టెస్టు క్రికెట్‌కు ఢోకా లేదు : మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ 

తాజా వార్తలు

Published : 09/09/2021 01:27 IST

కోహ్లీ ఆడినంత కాలం.. టెస్టు క్రికెట్‌కు ఢోకా లేదు : మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ 

ఇంటర్నెట్‌ డెస్కు: భారత క్రికెట్‌ సారథి విరాట్‌ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ఆడినంత కాలం టెస్టు క్రికెట్‌కు ఢోకాలేదని పేర్కొన్నాడు. ‘క్రీడల్లో నమ్మకం చాలా ముఖ్యం. కెప్టెన్‌పై నమ్మకం లేకపోతే ఎంత మంచి జట్టు ఉన్నా విజయం సాధించలేము. భారత క్రికెట్‌ జట్టు సారథిగా విరాట్‌ కోహ్లీ జట్టు సభ్యుల విశ్వాసాన్ని సంపాదించాడు. అతడు జట్టును నడిపించే తీరు అమోఘం. ఆటగాళ్లంతా అతడిని గౌరవిస్తారు. వాళ్లంతా అతడి వెన్నంటే ఉంటూ.. సమష్టిగా రాణిస్తున్నారు. కెప్టెన్‌కు అండగా ఉండే ఆటగాళ్లు దొరకడం గొప్ప విషయం. కోహ్లీ క్రికెట్‌ ఆడినంత కాలం టెస్టు మ్యాచులకు ఢోకా లేదు. మరింత ఎక్కువ కాలం క్రికెట్‌ ఆడండి కోహ్లీ’ అని వార్న్‌ అన్నాడు.  
  
ఇటీవల ముగిసిన ఓవల్‌ టెస్టులో 157 పరుగుల తేడాతో టీమిండియా ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో విదేశీ గడ్డపై 15 విజయాలతో.. అత్యంత విజయవంతమైన భారతీయ కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని