IPL 2021: కుర్రాళ్లే కొట్టేశారు.. ముంబయిపై కోల్‌కతా అలవోక విజయం

తాజా వార్తలు

Updated : 23/09/2021 23:25 IST

IPL 2021: కుర్రాళ్లే కొట్టేశారు.. ముంబయిపై కోల్‌కతా అలవోక విజయం

అబుదాబి: ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టంటే ప్రత్యర్థికి హడల్‌. ఐదు సార్లు ఛాంపియన్‌. బ్యాటర్ల నుంచి బౌలర్ల దాకా అందరూ అగ్రశ్రేణి ఆటగాళ్లే. ఐపీఎల్‌ 14 సీజన్‌ తొలి అర్ధభాగంలో అత్యుత్తమ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో నిలిచింది. ఇలాంటి జట్టు యూఏఈ వేదికగా జరుగుతున్న రెండో అంచెలో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవి చూసి ఆరోస్థానానికి పడిపోయింది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వరుస విజయాలతో అట్టడుగు నుంచి ఒక్కోస్థానాన్ని మెరుగుపరుచుకుంటూ ముంబయినే దాటి టాప్‌ 4లోకి దూసుకొచ్చింది.

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా మూడు వికెట్లను కోల్పోయి 15.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కోల్‌కతా బ్యాటర్లు రాహుల్ త్రిపాఠి (74*), వెంకటేశ్‌ అయ్యర్ (53) అర్ధశతకాలతో రాణించారు. శుభ్‌మన్ గిల్‌ 13, ఇయాన్‌ మోర్గాన్ 7, నితీశ్‌ రాణా 5* పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా వెంకటేశ్‌ అయ్యర్‌ ఎంపికయ్యాడు.

డికాక్ నిలిచినా.. మిగతావారు రాణించకపోవడంతో....

టాస్ ఓడిన ముంబయి ఇండియన్స్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (33), డికాక్‌ (55) తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే రోహిత్ ఔటైన తర్వాత వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (5) విఫలమయ్యాడు. ఈ క్రమంలో డికాక్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే స్వల్ప వ్యవధిలో డికాక్‌తోపాటు ఇషాన్‌ కిషన్‌ (14) పెవిలియన్‌కు చేరారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కృనాల్ పాండ్య (12) ఆకట్టుకోలేదు. పొలార్డ్‌ (21) ఫర్వాలేదనిపించినా.. భారీ షాట్లు కొట్టలేకపోయాడు. దీంతో ముంబయి 20 ఓవర్లలో ఆరు వికెట్లను నష్టపోయి కేవలం 155 పరుగులకే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లలో ఫెర్గూసన్ 2, ప్రసిద్ధ్ 2, సునిల్ నరైన్ ఒక వికెట్ పడగొట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని