close

తాజా వార్తలు

Updated : 01/10/2020 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆడి.. పాడి.. చిందేసిన కోహ్లీ

ఖాళీ సమయం ఆస్వాదిస్తున్న బెంగళూరు

(Tiwtter/Virat Kohli)

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయిపై సూపర్‌ఓవర్లో విజయం సాధించిన బెంగళూరు జట్టు తమకు దొరికిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, కుటుంబ సభ్యులు కలిసి సంబరాలు చేసుకున్నారు. మంగళవారం ఆడుతూ.. పాడుతూ గడిపారు. హాయిగా సేదతీరారు.

దుబాయ్‌ వేదికగా సోమవారం డిఫెండింగ్‌ ఛాంపియన్ ‌ముంబయి, బెంగళూరు తలపడ్డ సంగతి తెలిసిందే. ఓపెనర్లు దేవదత్‌ పడిక్కల్‌‌ (54), ఆరోన్‌ ఫించ్‌ (52), ఏబీ డివిలియర్స్‌ (55), శివమ్‌ దూబె (27) దూకుడుగా ఆడటంతో మొదట కోహ్లీసేన 201 పరుగులు చేసింది. ఛేదన దిగిన రోహిత్‌ సేన 39 పరుగుల్లోపే కీలకమైన మూడు వికెట్లను చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ క్రమంలో యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ (99), పొలార్డ్‌ (60) చెలరేగి ఆడి స్కోరును సమం చేశారు. ఆ తర్వాత జరిగిన సూపర్‌ ఓవర్లో ముంబయి 7 పరుగులు చేయగా బెంగళూరు ఆఖరి బంతికి విజయం అందుకుంది.

ఈ మ్యాచ్‌ ముగిసిన మరుసటి రోజు బెంగళూరు శిబిరంలో కోలాహలం నెలకొంది. అందరూ చక్కగా ఎంజాయ్‌ చేశారు. ఆటగాళ్లు రెండు బృందాలుగా విడిపోయి ఈత కొలనులో వాలీబాల్‌ ఆడారు. సరదాగా గొడవ పడ్డారు కూడా! క్రికెటర్లందరూ చక్కని శరీర సౌష్ఠవంతో కనిపించారు. ఆ తర్వాత సహాయ సిబ్బంది 1970ల్లోని పాటలు పాడగా.. కోహ్లీ, సైని, దూబె, పార్థివ్‌ హిందీ పాటలు ఆలపించారు. విరాట్‌ రెండు స్టెప్పులూ వేశాడు. ఇక ఏబీ తనకు నచ్చిన ఓ ఆంగ్ల గీతాన్ని వినిపించాడు. బెంగళూరు తన తర్వాత మ్యాచులో రాజస్థాన్‌తో శనివారం తలపడనుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.