Dinesh karthik: ఫిజియో కరోనా బారిన పడటంతో.. ఆటగాళ్లు గందరగోళానికి గురయ్యారు

తాజా వార్తలు

Published : 11/09/2021 02:35 IST

Dinesh karthik: ఫిజియో కరోనా బారిన పడటంతో.. ఆటగాళ్లు గందరగోళానికి గురయ్యారు

మాంచెస్టర్‌: టీమిండియాకు అసిస్టెంట్‌ ఫిజియోగా వ్యవహరిస్తున్న యోగేశ్‌ పర్మార్‌ కరోనా బారిన పడటంతో.. ఆటగాళ్లు గందరగోళానికి గురయ్యారని మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ అన్నారు. ‘నేను కొద్ది మంది ఆటగాళ్లతో మాట్లాడాను. నాలుగో టెస్టు తర్వాత చాలా మంది ఆటగాళ్లు అలిసిపోయి ఉన్నారు. దానికి తోడు కోచ్‌లు కూడా అందుబాటులో లేకపోవడంతో మానసికంగా బలహీనపడ్డారు. సీనియర్‌ ఫిజియో నితిన్‌ పటేల్‌, హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, మరో ఇద్దరు సహాయక సిబ్బంది కరోనా బారిన పడటంతో.. అసిస్టెంట్‌ ఫిజియో యోగేశ్‌పై ఒత్తిడి పడింది. ప్రస్తుతం అతడికి కూడా కరోనా సోకింది. దీంతో ఆటగాళ్లు మరింత గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఐదో టెస్టు నిర్వహణపై సందిగ్ధం నెలకొనడంతో.. చాలా మంది ఆటగాళ్లు తెలవారుజామున 3 గంటల వరకూ నిద్రపోలేదు’ అని దినేశ్‌ కార్తిక్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం బ్యాటింగ్‌ కోచ్‌ ఒక్కడే ఆటగాళ్లకు అందుబాటులో ఉంటున్న విషయం తెలిసిందే. శుక్రవారం ప్రారంభం కావాల్సిన చివరి టెస్టు మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం చర్చలు జరిపిన బీసీసీఐ, ఈసీబీ ఈ మ్యాచ్‌ను తర్వాత నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే, ఎప్పుడనే దానిపై స్పష్టత రాలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని