IND vs ENG: భారత్‌కు 50-50 అవకాశం!

తాజా వార్తలు

Updated : 04/07/2021 17:45 IST

IND vs ENG: భారత్‌కు 50-50 అవకాశం!

ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్‌ ఛాపెల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా విజయావకాశాలు 50-50గా ఉన్నాయని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌ అంచనా వేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైనా.. భారత పేస్‌ బౌలింగ్‌ యూనిట్‌ కొన్నేళ్లుగా అద్భుతంగా తయారైందని కొనియాడాడు. గతంలో మాదిరి వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జట్లలా భీకరంగా మారిందని కితాబిచ్చాడు.

‘ఇటీవలికాలంలో టీమ్‌ఇండియా బలమైన పేస్‌ బౌలింగ్‌ జట్లలో ఒకటిగా ఎదిగింది. అందువల్లే ఆ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో విజయం సాధించి ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌లోనూ వారి సొంతగడ్డపై గెలిచే అవకాశాలను 50-50గా సమానం చేసుకుంది. మంచి పేస్‌ బౌలింగ్‌ దళాన్ని కలిగి ఉండటం వాళ్లకు కలిసివచ్చింది. షమి, ఇషాంత్‌, బుమ్రా, సిరాజ్‌లాంటి బౌలర్లు టీమ్‌ఇండియా ఎదుగుదలకు కృషిచేశారు’ అని ఛాపెల్‌ చెప్పుకొచ్చాడు.

అనంతరం న్యూజిలాండ్‌పై స్పందించిన ఆసీస్‌ మాజీ సారథి.. ఆ జట్టులోనూ బలమైన పేస్‌ బౌలర్లు ఉన్నారన్నాడు. సౌథీ, బౌల్ట్‌, వాగ్నర్‌, జేమీసన్‌ లాంటి పేసర్లు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఉండేలా చూసుకున్నారన్నాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియాతో తలపడినప్పుడు వారంతా చివరిరోజు విజయం అందించారని ఛాపెల్‌ గుర్తు చేసుకున్నాడు. కివీస్‌ పేసర్లు అంతటి ప్రభావం చూపారని మెచ్చుకున్నాడు. దాంతో వారిని 1970-90 మధ్యలోని వెస్టిండీస్‌ బౌలింగ్‌ త్రయంతో పోల్చిచూశాడు. అప్పటి క్లైవ్‌లాయిడ్‌ నేతృత్ంలోని విండీస్‌ పేసర్లకన్నా ప్రస్తుత న్యూజిలాండ్‌ బౌలర్లే ఎంతో మేలని కొనియాడాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని