T20 World Cup: 4 బంతులు.. 4 వికెట్లు

తాజా వార్తలు

Updated : 19/10/2021 07:38 IST

T20 World Cup: 4 బంతులు.. 4 వికెట్లు

క్యాంఫర్‌ అరుదైన ఘనత

నెదర్లాండ్స్‌పై ఐర్లాండ్‌ గెలుపు

అబు ధాబి: టీ20 ప్రపంచకప్‌ తొలి రౌండ్లో ఐర్లాండ్‌ పేసర్‌ కర్టిస్‌ క్యాంఫర్‌ (4/26) సంచలనం సృష్టించాడు. వరుసగా 4 బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అరుదైన ఘనత అందుకున్నాడు. సోమవారం నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో క్యాంఫర్‌ ఈ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్స్‌ ఏడు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తుచేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ మ్యాక్స్‌ ఓడౌడ్‌ (51) అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇన్నింగ్స్‌ పదో ఓవర్లో వరుసగా 2, 3, 4, 5 బంతులకు కొలిన్‌ ఎకర్‌మన్‌ (11), ర్యాన్‌ టెన్‌ డస్కాటే (0), స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (0), వాండర్‌ మెర్వ్‌ (0)లను క్యాంఫర్‌ ఔట్‌ చేశాడు. టీ20 ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 2019లో ఐర్లాండ్‌లో రషీద్‌ఖాన్‌ (అఫ్గానిస్థాన్‌), 2019లో న్యూజిలాండ్‌పై లసిత్‌ మలింగ (శ్రీలంక) ఈ ఘనతను అందుకున్నారు. చివర్లో మార్క్‌ ఎడేర్‌ (3/9) విజృంభించడంతో నెదర్లాండ్స్‌ 106 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఐర్లాండ్‌ 15.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్టిర్లింగ్‌ (30 నాటౌట్‌), డెలానీ (44) మెరిశారు. మరో మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో నమీబియాను ఓడించింది. మొదట తీక్షణ (3/25), లహిరు కుమార (2/9)ల ధాటికి నమీబియా 96 పరుగులకే కుప్పకూలింది. భానుక (42 నాటౌట్‌), అవిష్క ఫెర్నాండో (30) రాణించడంతో లక్ష్యాన్ని లంక 13.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని