T20 World Cup: కోహ్లి చెప్పాడు.. ఓపెనర్‌ నేనే

తాజా వార్తలు

Published : 10/10/2021 08:39 IST

T20 World Cup: కోహ్లి చెప్పాడు.. ఓపెనర్‌ నేనే

అబుదాబి: త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఓపెనర్‌ పాత్ర కోసమే తనను ఎంచుకున్నట్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తనతో చెప్పాడని యువ కెరటం ఇషాన్‌ కిషన్‌ అన్నాడు. ఐపీఎల్‌-14లో కొన్ని మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమైన కిషన్‌.. చివరి రెండు మ్యాచ్‌ల్లో (50, 84) చెలరేగాడు. చివరగా బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో కిషన్‌ విఫలమవగా.. మ్యాచ్‌ అనంతరం అతణ్ని కోహ్లి ఓదారుస్తూ, సూచనలివ్వడం కనిపించింది. కొంత కాలంగా టీ20ల్లో రోహిత్‌కు తోడుగా భారత్‌ ఓపెనర్లను మార్చి మార్చి ఆడిస్తోంది. ధావన్‌ జట్టులో చోటు కోల్పోయాక కొన్ని మ్యాచ్‌ల్లో రాహుల్‌, తర్వాత కోహ్లి అతడితో కలిసి ఓపెనింగ్‌ చేశారు. అయితే కిషన్‌ మాటల్ని బట్టి చూస్తే టీ20 ప్రపంచకప్‌లో అతనే రోహిత్‌ భాగస్వామి కావచ్చనిపిస్తోంది. ‘‘ఓపెనింగ్‌ చేయడాన్ని ఇష్టపడతా. టీ20 ప్రపంచకప్‌లో నన్ను ఆ స్థానంలోనే దించబోతున్నట్లు విరాట్‌ భాయ్‌ చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే అన్నిటికి సిద్ధంగా ఉండాలి. విరాట్‌తో పాటు హార్దిక్‌, పొలార్డ్‌తో మాట్లాడడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’’ కిషన్‌ చెప్పాడు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని