అమ్మ.. డాన్స్‌ చేయాలంటే: గబ్బర్‌

తాజా వార్తలు

Published : 14/07/2020 01:41 IST

అమ్మ.. డాన్స్‌ చేయాలంటే: గబ్బర్‌

గబ్బర్‌ను కవ్వించిన యుజువేంద్ర చాహల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటాడు. తనకు సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటాడు. గాయాలైనా.. కష్టాలైనా నవ్వుతూ ఎదుర్కొనే మనస్తత్వం అతడిది. కరోనా వైరస్‌ ముప్పుతో అంతర్జాతీయ క్రికెట్‌ స్తంభించిన సంగతి తెలిసిందే. అయితే అందివచ్చిన ఈ అవకాశాన్ని క్రికెటర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒకపక్క ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతూనే మరోవైపు కుటుంబ సభ్యులతో సమయం ఆస్వాదిస్తున్నారు.

తాజాగా గబ్బర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. అందులో ఓ పంజాబీ పాటకు తన కొడుకు జొరావర్‌తో కలిసి చిందులు వేశాడు. భార్య ఆయేషాను సైతం తనతో కలిసి కాలు కదపాలని కోరాడు. సోఫాలో హాయిగా కూర్చున్న ఆమె రానంటే రానని మొండికేసింది. దాంతో... ‘భార్యను ఒప్పించాలంటే కొడుకు మద్దతు ఉండాల్సిందే’ అని ధావన్‌ అన్నాడు. కానీ కథ ఇక్కడితోనే అయిపోలేదు!

టీమ్‌ఇండియా చిలిపి కుర్రాడు యుజువేంద్ర చాహల్‌ వేలు పెట్టేశాడు. ‘భయ్యా.. వదిన డాన్స్‌ చేయడం మొదలుపెడితే జోరూ బేబీ అటు వైపుంటాడు (అంటే గబ్బర్‌ జోడీ ఎవరూ ఉండరని) మరి’ అంటూ కవ్వించేశాడు. ప్రస్తుతం ఈ సంభాషణ ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని