close

తాజా వార్తలు

ఏమీ దొరకనిచోట విజయాన్ని దోచుకున్న భారత్‌

రోహిత్‌ శర్మ, మహ్మద్‌ షమిపై ప్రశంసల జల్లు

ముంబయి: న్యూజిలాండ్‌ గడ్డపై టీమ్‌ఇండియా తొలి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. సెడాన్‌ పార్క్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. మరో రెండు మ్యాచులు మిగిలుండగానే 3-0తో సిరీస్‌ను సాధించింది. ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఓటమి కోరల్లో చిక్కుకొని విజయ దుందుభి మోగించిన కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వీవీఎస్‌ లక్ష్మణ్‌ మొదలుకొని ఎందరో టీమ్‌ఇండియా ప్రదర్శనను మెచ్చుకుంటున్నారు.


ప్రశాంతంగా ఉంటూ రోహిత్‌ శర్మపై నమ్మకం ఉంచండి. మ్యాచ్‌లను మలుపు తిప్పగల ఆటగాళ్లెందరో భారత జట్టులో ఉన్నారు. బుమ్రాకు ఈ రోజు అచ్చిరాలేదు. అయితే మహ్మద్ షమి ఆదుకున్నాడు.

- మహ్మద్ కైఫ్‌


సూపర్‌ ఓవర్‌ ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం. రోహిత్‌ రెండు సిక్సర్లు బాదేశాడు. ఎలాంటి థ్రిల్లర్‌ ఇది! రోహిత్‌, రాహుల్‌, జడేజా, షమి ఇతర ఆటగాళ్లు ఎంతో కృషి చేశారు

- యూసుఫ్‌ పఠాన్‌


సూపర్‌ ఓవర్‌లో సూపర్‌ విజయం. సిక్సర్లతో రోహిత్‌ మ్యాచును ముగించడం సంచలనం. మరోసారి అతడిని మించి ఎక్కువ సిక్సర్లు మరెవ్వరూ ఎందుకు బాదలేరో చూపించాడు

- ఆకాశ్‌ చోప్రా


ఎంత అద్భుత విజయమిది. ఆఖరి 4 బంతుల్లో షమి 2 పరుగుల్ని రక్షించడం సంచలనం. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌లో తానూ ఒకడని రోహిత్‌శర్మ మరోసారి చాటాడు. ఈ మ్యాచ్‌ ఎన్నో.. ఎన్నో రోజులు గుర్తుంచుకోవచ్చు

- వీవీఎస్‌ లక్ష్మణ్‌


అసాధ్యాలను సుసాధ్యం చేసేందుకు రోహిత్‌ శర్మ కచ్చితంగా సరిపోతాడు. కానీ 4 బంతుల్లో 2 పరుగుల్ని షమి కాపాడటం నమ్మశక్యం కానిది

- వీరేంద్ర సెహ్వాగ్‌


చాలా బాగా ఆడావు రోహిత్ శర్మ. ఉత్కంఠకర విజయం సాధించేందుకు డెత్‌ ఓవర్లలో మహ్మద్ షమిది అద్భుత బౌలింగ్‌- జులన్‌ గోస్వామి

 


ధమాకేదార్‌: లాజవాబ్‌! షాందార్‌! ఏమీ దొరకని చోట విజయాన్ని దోచుకున్నారు! మహ్మద్ షమి ఆఖరి ఓవర్‌ జబర్దస్త్‌. ఇక రోహిత్‌ శర్మ బాదిన ఆ రెండు సిక్సర్లు మది దోచుకున్నాయి. నిజంగా అద్భుతం!

- సూర్యకుమార్‌ యాదవ్‌


నిజమైన క్రీడల్లో ఉండే నాటకీయత ఇదే. తక్కువ సమయం ఉంటుంది కాబట్టి కేవలం ఇదో టీ20 అనడం నేను విన్నాను. విజయానికి 2 బంతుల్లో 10 పరుగులు చేసేందుకు, 5 బంతుల్లో 3 పరుగుల్ని కాచుకొనేందుకు ఎంతో నైపుణ్యం, ప్రశాంతత అవసరం. ఏ మాత్రం పొరపాటు జరగొద్దు  - హర్షభోగ్లే

 


సూపర్‌ ఓవర్‌లో ఎలాంటి విజయమిది. తొలిసారి న్యూజిలాండ్‌ గడ్డపై టీ20 సిరీస్‌ కైవసం. అభినందనలు. 2 బంతుల్లో 10 పరుగులు అవసరం. రోహిత్‌ రెండు సిక్సర్లు బాదేశాడు. నమ్మశక్యం కాదిది

- అమితాబ్‌ బచ్చన్‌


టీమ్‌ఇండియాకు ఎలాంటి విజయమిది. అద్భుతమైన క్రికెట్‌. ఉత్కంఠరేపింది. ఆటగాళ్లకు అభినందనలు. అందరూ బాగా ఆడారు. రోహిత్‌ శర్మది అద్భుతమైన ముగింపు. షమి 2 పరుగుల్ని కాపాడుకోవడం మర్చిపోలేనిది. ఇలాగే ముందుకు సాగాలి- మనోజ్‌ తివారీ

 


అద్భుతమైన క్రికెట్‌. సూపర్‌ ఓవర్లో రోహిత్‌ శర్మ ఎంతో ప్రశాంతంగా ఆడాడు. విజయ తీరాలకు చేర్చాడు- రవిచంద్రన్‌ అశ్విన్‌

 


రోహిత్‌ హైతో మామ్లా హిట్‌ హై. అద్భుతమైన టీ20 సిరీస్‌ విజయం. టీమ్‌ఇండియాకు అభినందనలు- హర్భజన్‌ సింగ్‌

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.