2127 మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ సిద్ధం 

తాజా వార్తలు

Published : 03/07/2021 19:30 IST

2127 మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ సిద్ధం 

నవంబర్‌ 16 నుంచి రంజీ ట్రోఫీ

దిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా గతేడాది సరిగ్గా నిర్వహించలేకపోయిన దేశవాళీ క్రికెట్‌ను బీసీసీఐ ఈసారి పూర్తిస్థాయిలో జరపడానికి సిద్ధమైంది. 2021-22 సీజన్‌కు సంబంధించి అన్ని స్థాయిల టోర్నమెంట్లు, మ్యాచ్‌లు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా మొత్తం 2,127 మ్యాచ్‌ల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. నవంబర్‌ 16 నుంచి రంజీ ట్రోఫీ మొదలవ్వనున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతేడాది కరోనా నేపథ్యంలో రంజీ ట్రోఫీతో పాటు మిగతా  టోర్నీలేవీ జరగని సంగతి తెలిసిందే.

అప్పుడు కేవలం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే ట్రోఫీలు మాత్రమే నిర్వహించింది. ఈ ఏడాది అలా కాకుండా అన్ని టోర్నీలను మునుపటిలా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ‘ఈ 2021-22 సీజన్‌ సెప్టెంబర్‌ 21 నుంచి సీనియర్‌ మహిళల వన్డే లీగ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అక్టోబర్‌ 27 నుంచి సీనియర్‌ మహిళల వన్డే ఛాలెంజర్‌ ట్రోఫీ ఉంటుంది. ఈ క్రమంలోనే అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 12 వరకు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ, నవంబర్‌ 16 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు రంజీ ట్రోఫీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 26 వరకు విజయ్‌ హజారే ట్రోఫీ నిర్వహించనున్నారు. బీసీసీఐ ఈ సీజన్‌ను విజయవంతంగా నిర్వహిస్తుందనే పూర్తి నమ్మకం ఉంది. అలాగే ఇందులో భాగమైన ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రత మాకెంతో ముఖ్యం’ అని ఆ లేఖలో పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని