తొలిసారిగా అర్జున్‌ తెందూల్కర్‌..

తాజా వార్తలు

Published : 02/01/2021 22:15 IST

తొలిసారిగా అర్జున్‌ తెందూల్కర్‌..

ముంబయి సీనియర్‌ జట్టుకు ఎంపిక

ముంబయి: సచిన్‌ తెందూల్కర్‌ తనయుడు, అర్జున్‌ తెందూల్కర్‌ తొలిసారి ముంబయి సీనియర్‌ జట్టుకు ఎంపికయ్యాడు. 22 మంది సభ్యులున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ముంబయి చీఫ్‌ సెలక్టర్‌ సలిల్‌ అంకోలా ఈ విషయాన్ని శనివారం ధ్రువీకరించారు. అర్జున్‌తో పాటు కృతిక్‌ హనగవడి ఎంపికయ్యాడు.

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ జట్టుకు ముందుగా 20 మందితో జట్లను ఎంపిక చేయాలని బీసీసీఐ రాష్ట్ర సంఘాలకు తెలిపింది. ప్రస్తుతం ఆ సంఖ్యను 22కు పెంచుతూ నిర్ణయింది. ఫలితంగా అర్జున్‌, కృతిక్‌ను ముంబయి ఎంపిక చేసుకుంది. ఇదే విషయాన్ని ముంబయి క్రికెట్‌ సంఘం మీడియాకు తెలిపింది. 21ఏళ్ల అర్జున్‌ ముంబయి సీనియర్‌ జట్టుకు ఎంపికవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో అతడు వివిధ వయసు విభాగాల్లో ముంబయికి ప్రాతినిధ్యం వహించాడు.

ఎడమచేతి వాటం పేసరైన అర్జున్‌ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగలడు. ఆల్‌రౌండర్‌గా ముంబయి జూనియర్‌ జట్లకు సేవలందించాడు. భారత అండర్‌-19 జట్టుకూ ఆడాడు. శ్రీలంకలో పర్యటించాడు. ఇక టీమ్‌ఇండియాకూ అవసరమైనప్పుడు నెట్‌బౌలర్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌లో మహిళల వన్డే ప్రపంచకప్‌ సమయంలో భారత అమ్మాయిలకు నెట్స్‌లో బంతులు విసిరాడు. కాగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ముంబయి జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహిస్తున్నాడు. జనవరి 10న టోర్నీ ఆరంభమవుతుంది.

ఇవీ చదవండి
షాక్‌: ఐసోలేషన్‌కు ఐదుగురు టీమ్‌ ఇండియా క్రికెటర్లు
దాదా.. త్వరగా కోలుకో ప్లీజ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని