
తాజా వార్తలు
ఒలింపిక్స్ వాయిదా భారం ఎంతంటే..
టోక్యో: ఏడాది వాయిదా పడ్డ కారణంగా టోక్యో ఒలింపిక్స్ వ్యయం దాదాపు రూ.15 వేల కోట్లు పెరిగిందని అంచనా. క్రీడల నిర్వాహకుల సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ జపాన్ మీడియా ఈ విషయం వెల్లడించింది. 2020 టోక్యో ఒలింపిక్స్ కొవిడ్-19 వల్ల 2021కి వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. పెరిగిన వ్యయాన్ని తాము కూడా కొంత భరించనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఇంతకుముందు చెప్పింది. టోక్యో ఒలింపిక్స్ అధికారిక ఖర్చు 12.6 బిలియన్ డాలర్లు. కానీ అసలు వ్యయం అంతకు రెండింతలు ఉండొచ్చని గత ఏడాది ప్రభుత్వ ఆడిట్లో తేలింది. ఒలింపిక్స్ వచ్చే ఏడాది జులై 23న ఆరంభం కావాల్సి ఉంది.
Tags :
స్పోర్ట్స్
జిల్లా వార్తలు