close

తాజా వార్తలు

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌

చెన్నై: ఇప్పటికే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్‌పై కన్నేసింది. మరికొద్దిసేపట్లో భారత్×వెస్టిండీస్‌ తొలి వన్డే ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్ ఓడిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. బ్యాటింగ్‌నే ఎంచుకోవాలనుకున్నామని తెలిపాడు. మయాంక్‌ అగర్వాల్‌, శార్దూల్ ఠాకూర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాలని కోహ్లీసేన భావిస్తోంది. మరోవైపు వెస్టిండీస్‌ కోహ్లీసేనను ప్రతిఘటించి మ్యాచ్‌ను గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

జట్ల వివరాలు

భారత్‌: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి

వెస్టిండీస్‌: హోప్‌‌, సునిల్ అంబ్రిస్‌‌‌, హెట్‌మెయిర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ ఛేజ్‌, పొలార్డ్‌ (కెప్టెన్‌), హోల్డర్‌, కీమో పాల్‌‌, హేడెన్‌ వాల్ష్‌, అల్జారి జోసెఫ్, కాట్రెల్‌    


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.