close

తాజా వార్తలు

Published : 21/09/2020 11:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ షాహీన్‌ అఫ్రిది విజృంభించాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు నేలకూల్చాడు. ఇంగ్లాండ్‌ కౌంటీలో భాగంగా హాంప్‌షైర్‌, మిడిల్సెక్స్‌ మధ్య ఆదివారం టీ20 మ్యాచ్‌ జరిగింది. అందులో షాహీన్‌ 6/19తో రెచ్చిపోయాడు. జాన్‌ సింప్సన్‌, స్టీవెన్‌ ఫిన్‌, తిలాన్‌, టిమ్‌ ముర్తాఘ్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చి రికార్డు సృష్టించాడు. అఫ్రిది దెబ్బకు మిడిల్సెక్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కుప్పకూలింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన హాంప్‌షైర్‌ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 141పరుగులు చేసింది. ఛేదనలో మిడిల్సెక్స్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడటంతో 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. షాహీన్‌ అఫ్రిదికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. కాగా.. పాకిస్థాన్‌ తరఫున టీ20ల్లో వరుస బంతుల్లో 4 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా షాహీన్‌ రికార్డు సృష్టించాడు. మొత్తంగా చూసుకుంటే మూడో బౌలర్‌. ఇంతకుముందు శ్రీలంక బౌలర్‌ లసిత్‌ మలింగ, అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ఈ ఘనత సాధించారు. కాగా.. నాలుగు వికెట్లలో నాలుగు క్లీన్‌ బౌల్డ్‌లే ఉండటం విశేషం.



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.