close

తాజా వార్తలు

Updated : 29/10/2020 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

 సూర్యకుమార్‌పై కోహ్లీకి ఇంత ద్వేషమా?

స్లెడ్జింగ్‌ చేశాడంటూ వీడియో వైరల్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: అబుదాబి వేదికగా గతరాత్రి బెంగళూరుతో తలపడిన మ్యాచ్‌లో ముంబయి బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(79*) చెలరేగడంతో ఆ జట్టు సునాయాస విజయం సాధించింది. దాంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి టీమ్‌గా ముంబయి నిలిచింది. ఈ నేపథ్యంలోనే ముంబయి ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌ పూర్తికాగానే బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. సూర్యకుమార్‌ వద్దకెళ్లి స్లెడ్జింగ్‌ చేశాడని సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్‌గా మారింది. 

డేల్‌ స్టెయిన్‌ వేసిన 13వ ఓవర్‌లో ఒక లెగ్‌బైస్‌ రావడంతో పాటు సూర్యకుమార్‌ మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో అతడు 40 పరుగులకు చేరుకొని ప్రమాదకరంగా మారుతున్నాడు. అప్పటికి ముంబయి స్కోర్‌ 99/3. బెంగళూరుకు కూడా విజయావకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కోహ్లీకి కోపం వచ్చి సూర్య వద్దకు వెళ్లాడు. అప్పుడే ముంబయి బ్యాట్స్‌మన్‌ బెంగళూరు కెప్టెన్‌ను పట్టించుకోకుండా పక్కకు తప్పుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ స్లెడ్జింగ్‌ చేశాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.