close
Array ( ) 1

తాజా వార్తలు

నిజంగా బాగా ఆడుతున్నా: విరాట్‌ కోహ్లీ

కివీస్‌ పర్యటనలో తన బ్యాటింగ్‌పై స్పందించిన కెప్టెన్‌

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ పర్యటనలో తాను నిజంగా బాగా ఆడుతున్నానని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఓటమిపాలయ్యాక విరాట్‌ మీడియాతో మాట్లాడుతూ.. తన బ్యాటింగ్‌తో పాటు జట్టు పరిస్థితులపై స్పందించాడు. ఈ పర్యటనలో తాను బాగానే ఉన్నానని, బాగా ఆడుతున్నానని చెప్పాడు. కొన్నిసార్లు మనం చేసే పరుగులు మన బ్యాటింగ్‌ విధానాన్ని ప్రతిబింబిచవని అభిప్రాయపడ్డాడు. దీర్ఘకాలంగా తీరిక లేకుండా ఆడటం వల్ల మూడు-నాలుగు ఇన్నింగ్స్‌లు మనం అనుకున్నట్లు సాగవని చెప్పాడు. వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు.

అయితే, తాను ఒక్క ఇన్నింగ్స్‌ బాగా ఆడకపోతేనే.. బయట మాట్లాడుకునే పరిస్థితులు మారిపోతాయని చెప్పాడు. తాను మాత్రం అలా ఆలోచించేవాడిని కాదని, అలా ఆలోచిస్తే.. తాను కూడా వారి మధ్యే ఉండేవాడినని చెప్పాడు. చిన్నచిన్న పొరపాట్లను సరిచేసుకొని ప్రాక్టీస్‌ సెషన్‌లో మరింత కష్టపడితే సరైన ఫలితాలొస్తాయని కోహ్లీ చెప్పాడు. మంచి ప్రదర్శనతోనే గర్వపడాలని, తాను ఎల్లప్పుడూ అదే చేశానన్నాడు. రెండో టెస్టులో విజయం సాధించడానికి కృషిచేస్తానని టీమ్‌ఇండియా కెప్టెన్‌ స్పష్టంచేశాడు. జట్టు విజయం సాధించినప్పుడు 40 పరుగులైనా సరిపోతాయని, అదే ఓటమిపాలైతే.. శతకం బాదినా ఉపయోగం లేదన్నాడు. తాను అలాంటి ఆలోచన దృక్పథంతోనే ఉంటానని కోహ్లీ వివరించాడు. 

అలాగే బయటి నుంచి ఎదురయ్యే విమర్శలను పట్టించుకోమని, తదుపరి మ్యాచ్‌లో ఎలా రాణించాలనే దానిపైనే టీమ్‌ఇండియా దృష్టి పెడుతుందని కోహ్లీ అన్నాడు. ఎలాంటి జట్టునైనా, ఎక్కడైనా ఓడించగల సత్తా తమకుందని తెలిసి కూడా చాలా మంది విమర్శిస్తారని కోహ్లీ పేర్కొన్నాడు. ఒకవేళ భారత్‌ రెండో టెస్టులో ఓటమిపాలైనా తాము ఆందోళన చెందమని, అంతర్జాతీయ స్థాయిలో ఆడటం అంత తేలిక కాదని చెప్పాడు. ఆటలో గెలుపోటములు సర్వసాధారణమని, ఓటముల నుంచే తమ తప్పులను తెలుసుకోగలమని కోహ్లీ వివరించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.