close
Array ( ) 1

తాజా వార్తలు

కోహ్లీ ముంగిట.. ఆ రెండు రికార్డులు

వెల్లింగ్టన్‌: రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ మరో రెండు మైలురాళ్లకు చేరువలో ఉన్నాడు. సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా టీమిండియా ఇప్పటికే ఆ దేశం చేరుకుంది. అయితే, ఈ సిరీస్‌లో భారత్‌ 5 టీ20 మ్యాచులు ఆడనుండటంతో విరాట్‌ కోహ్లీ ఆ రెండు రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది.

న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20ల్లో మరో ఎనిమిది సిక్సులు కొడితే 50 సిక్సులు బాదిన రెండో కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ఇప్పటి వరకూ కేవలం ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మాత్రమే ఈ ఘనత సాధించాడు. మోర్గాన్‌ టీ20ల్లో 62 సిక్సులు కొట్టాడు. ఇక పరుగుల విషయంలోనూ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. భారత మాజీ సారథి ధోనీ టీ20ల్లో కెప్టెన్‌గా 1,110 పరుగులు చేశాడు. ధోనీ నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్న కోహ్లీ 1,032 పరుగులతో ఆ రికార్డు బద్దలు కొట్టేందుకు అతి సమీపంలో ఉన్నాడు. ఇప్పటి వరకూ టీ20ల్లో 1273 పరుగులతో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ అందరికంటే ముందున్నాడు. అయితే, కోహ్లీ మరో 80 పరుగులు చేస్తే ధోనీ రికార్డు, 241 పరుగులు చేస్తే డుప్లెసిస్‌ రికార్డును అధిగమిస్తాడు. 
విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా స్వదేశంలో ఇప్పటికే టీ20ల్లో శ్రీలంకను, వన్డేల్లో ఆస్ట్రేలియాను చిత్తుచేసి ఉత్సాహంతో ఉంది. అయితే, న్యూజిలాండ్‌ను వాళ్ల గడ్డపైనే ఎదుర్కోనుండటంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 29 వరకు సాగే ఈ సిరీస్‌లో ఐదు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచులు ఆడనుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.