close

తాజా వార్తలు

బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!

ముంబయి: డైపర్లు వేసుకునే ఓ బుడతడి బ్యాటింగ్‌ చూసి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫిదా అయ్యాడు. ప్లాస్టిక్‌ బ్యాట్‌ పట్టి అద్భుతంగా స్ట్రైట్‌ డ్రైవ్‌లు, కవర్‌ డ్రైవ్‌లు ఆడుతున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ గత నవంబర్‌లో ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దాన్ని కెవిన్‌ పీటర్సన్‌ మళ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసి కోహ్లీని ట్యాగ్‌ చేశాడు. అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన కలిగిన ఆ బుడ్డోడిని టీమిండియా కెప్టెన్‌ భారత జట్టులో చేర్చుకుంటావా అని చమత్కరించాడు. ఆ తర్వాత కోహ్లీ బుడ్డోడి బ్యాటింగ్‌ చూసి ఫిదా అయ్యాడు. డైపర్లేసుకొని బ్యాటింగ్‌ చేస్తున్న ఆ చిన్నోడి ప్రతిభ నమ్మశక్యంగా లేదని.. అతడు ఎక్కడుంటాడని కోహ్లీ ప్రశ్నించాడు.



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.