close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120028438 [video_srlno] => 1 [video_type] => 5 [video_link] => B9GVHuhjVoB [video_short_link] => B9GVHuhjVoB [created_by] => [created_date] => [modified_by] => 8917202 [modified_date] => 2020-02-28 23:58:45.39632 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

లవ్‌ కోసం చలిలో బయటకొచ్చా: యువీ

హేజెల్‌ కీచ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన యువరాజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌ తన సతీమణి హేజెల్‌ కీచ్‌పై వలపు బాణాలు విసిరాడు. అంతేకాదండోయ్‌ ఓ పంచ్‌ సైతం వేశాడు. ఎందుకంటారా? శుక్రవారం (ఫిబ్రవరి 28) అతడి సతీమణి హేజెల్‌ పుట్టిన రోజు. 33వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా యువీ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు.

హేజెల్‌ జన్మదిన వేడుకను జరుపుకుకొనేందుకు ఈ జంట న్యూయార్క్‌ వెళ్లింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద ఓ ఫొటో దిగింది. ఆ చిత్రాన్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన యువీ ‘హే.. హేజీ. ఈ రోజు నీ పుట్టినరోజు! గడ్డ కట్టించే చలిలో నన్ను బయటకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇది నీ జన్మదినం. ఈ రోజంతా గొప్పగా గడిపేయ్‌ నా లవ్‌ హేజెల్‌కీచ్‌’ అని వ్యాఖ్య జత చేశాడు.

యువరాజ్‌ చాలా సరదాగా ఉంటాడు. టీమ్‌ఇండియా డ్రస్సింగ్‌ రూమ్‌లో అతడు భజ్జీతో కలిసి చేసిన అల్లరిని ఇప్పటికీ అందరూ గుర్తుతెచ్చుకుంటారు. తనలోని ఆ ఫ్రాంక్‌నెస్‌ను ఇప్పుడీ వ్యాఖ్యలోనూ చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ ప్రస్తుతం ప్రైవేటు లీగుల్లో సరదా క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడు. తన సోదరుడు జొరావర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ వెబ్‌సిరీస్‌లో సతీమణితో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.