close

తాజా వార్తలు

Published : 30/10/2020 18:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జడేజా సిక్స్‌.. చాహల్‌ జోక్స్‌.. హెట్‌మైయిర్‌ ప్రాక్టీస్‌

 టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌ కీలక దశకు చేరుకుంది. గురువారం చెన్నై.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. ఈ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు లేకపోయినా దాని ఫలితం మాత్రం ఇతర జట్లపై ప్రభావం చూపుతోంది. తాజాగా కోల్‌కతా ఓటమిపాలవ్వడంతో ముంబయి 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కి చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ క్రమంలోనే ఫ్రాంఛైజీలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న కొన్ని విశేషాలను మీకోసం..

* చెన్నై 13 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి చివరి స్థానంలో నిలిచింది. గతరాత్రి కోల్‌కతాను ఓడించింది. చివరి బంతికి రవీంద్ర జడేజా సిక్సర్‌ బాది గెలిపించాడు. దీంతో చెన్నై ఆటగాళ్లు గ్యాలరీ వద్ద ఎగిరి గంతులేశారు. జడ్డూ సైతం విజయకేతనం చూపించాడు. 

* కోల్‌కతా ఓటమితో ముంబయి ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ గాయం కారణంగా ఆడలేకపోతున్నా కీరన్‌ పోలార్డ్‌ ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో దూసుకుపోతోంది.

* బెంగళూరు టీమ్‌లో అత్యంత సరదా ఆటగాడు యుజువేంద్ర చాహల్‌. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తన సహచర ఆటగాళ్లు క్రిస్‌మోరిస్‌, నవ్‌దీప్‌సైనితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఈ ముగ్గురూ సమాధానాలు చెప్పారు.

* హైదరాబాద్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. తన గూగ్లీలతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నాడు. వికెట్లు తీస్తూ, పరుగులు ఇవ్వకుండా కట్టుదిట్టంగా బంతులేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆ జట్టు రషీద్‌ఖాన్‌ గురించి ఆసక్తికర వీడియోను పంచుకుంది. అదేంటో మీరూ చూసేయండి. 

* దిల్లీ రెండు వారాల క్రితం వరకు విజయాలతో దూసుకుపోయింది. చివరగా చెన్నైపై గెలుపొందిన ఈ జట్టు ఇప్పుడు అనూహ్యంగా ఓటముల బాట పట్టింది. వరుసగా గతమూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. కాగా, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ ప్రాక్టీస్‌  చేస్తున్న వీడియోను దిల్లీ ట్విటర్‌లో పంచుకుంది. అతడు సిక్సర్లు కొట్టేముందు ఎలా సన్నద్ధమవుతాడో చూపిస్తూ ఈ వీడియోను పంచుకుంది. 

* చెన్నైతో తలపడిన మ్యాచ్‌లో ఓటమిపాలైనా తమ జట్టుకు ఇంకా ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయని కోల్‌కతా మెంటార్‌ డేవిడ్‌ హస్సీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని, దాంతో రాబోయే రోజుల్లో తామకు అన్ని ఫలితాలు కలిసివస్తాయని చెప్పాడు. ప్లేఆఫ్స్‌లో ఇతర జట్లను ఆశ్చర్యపరుస్తామని పేర్కొన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.