ఇది నాకెంతో ప్రత్యేకమైన దీపావళి

తాజా వార్తలు

Published : 15/11/2020 03:16 IST

ఇది నాకెంతో ప్రత్యేకమైన దీపావళి

మన సైనికులకు ప్రత్యేక శుభాకాంక్షలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ దీపావళి తనకెంతో ప్రత్యేకమని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా అన్నాడు. ఈసారి వేడుకల్లో తన కుమారుడు రియో కుటుంబ సభ్యులతో కొత్తగా చేరడం సంతోషంగా ఉందన్నాడు. ఏటా దీపావళి రోజున రైనా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాడు. ఈసారి కూడా కొత్త ఇంట్లో ఈ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ట్వీట్‌ చేశాడు. అలాగే దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీర జవాన్లకు కూడా రైనా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాడు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ రక్షణే పరమావధిగా భావిస్తూ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ సేవ చేస్తున్న వారికి ఈ దీపావళి మరింత శక్తిని ఇవ్వాలని కోరాడు. 

రైనా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ వీడ్కోలు పలికిన కొద్ది సేపటికే రైనా సైతం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అనంతరం జరిగిన ఐపీఎల్‌ టోర్నీలో ఈ చెన్నై స్టార్‌ బ్యాట్స్‌మన్‌ వ్యక్తిగత కారణాలతో ఆడలేకపోయాడు. తొలుత దుబాయ్‌కి చేరుకున్న రైనా కొద్ది రోజుల్లోనే భారత్‌కు తిరిగి వచ్చాడు. ఆపై రైనాకు ప్రత్యామ్నాయంగా సరైన ఆటగాడిని ఎంపిక చేయకుండానే చెన్నై బరిలో దిగింది. ఈ క్రమంలోనే లీగ్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి చెన్నై ప్లేఆఫ్స్‌ కూడా చేరకుండా నిష్క్రమించింది. ఇక వచ్చే ఏడాదైనా రైనా ఆడతాడో లేదో చూడాలి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని