close
Array ( ) 1

తాజా వార్తలు

సిక్సర్‌ లేకుండా చరిత్ర సృష్టించిన శ్రీలంక జట్టు

సిక్సర్‌ లేకుండా వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన లంకేయులు

ముంబయి: అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్‌ లేకుండా వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. హంబన్‌తోట వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచులో 8 వికెట్లు నష్టపోయి 345 పరుగులు చేసింది. సిక్సర్‌ లేకుండా 50 ఓవర్ల క్రికెట్లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 2011లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్‌ సాధించిన 333/6ను లంకేయులు బద్దలు కొట్టారు.

శ్రీలంక ఇన్నింగ్స్‌లో మొత్తం 33 బౌండరీలు నమోదయ్యాయి. ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో (127; 123 బంతుల్లో 10×4), కుశాల్‌ మెండిస్‌(119; 119 బంతుల్లో 12×4) శతకాలతో కదం తొక్కారు. వీరిద్దరూ కలిసి 22 ఫోర్లు బాదేశారు. మిగతా అందరూ కలిపి 11 బౌండరీలు సాధించారు. తిసారా పెరీరా (36; 25 బంతుల్లో 4×4) ఫర్వాలేదనిపించాడు. విండీస్‌ బౌలర్లు షెల్డన్‌ కాట్రెల్‌ 4, అల్జారీ జోసెఫ్‌ 3 వికెట్లు పడగొట్టారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.