
తాజా వార్తలు
అమెరికా క్రికెట్లోకి షారుఖ్ ‘నైట్‌రైడర్స్’ ఎంట్రీ
కోల్‌కతా: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌కు చెందిన నైట్‌రైడర్స్ సంస్థ అమెరికా క్రికెట్ మార్కెట్లో రంగప్రవేశం చేస్తోంది. మిలియన్ డాలర్ల విలువగల మేజర్ లీగ్ క్రికెట్ టీ20 టోర్నీలో పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగా అమెరికన్ క్రికెట్ ఎంటర్ప్రైజెస్ (ఏసీఈ)తో నైట్‌రైడర్స్ చేతులు కలిపింది. కీలక వాటాదారుగా మారింది.
‘కొన్నేళ్లుగా మేం నైట్‌రైడర్స్ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాం. అమెరికాలోని టీ20 క్రికెట్ సామర్థ్యాన్ని గమనించాం’ అని షారుఖ్ ఖాన్ అన్నాడు. ‘మేజర్ లీగ్ క్రికెట్ ప్రణాళికల పట్ల మేం సంతృప్తిగా ఉన్నాం. రాబోయే రోజుల్లో విజయవంతం అయ్యేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నాం’ అని పేర్కొన్నాడు. షారుఖ్ వ్యాపార భాగస్వామి జుహీచావ్లా, ఆమె భర్త జే మెహతా సైతం అమెరికాలో పెట్టుబడుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయవంతం అయ్యాక అనేక దేశాల్లో టీ20 లీగులు ఆరంభించారు. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ సూపర్‌హిట్ అయింది. కరీబియన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లీగులూ అలరించాయి. తాజాగా శ్రీలంకలో టీ20 లీగ్ మొదలవుతోంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ఇదే బాటలో పయనిస్తున్నాయి. అమెరికాలో దక్షిణాసియా వాసులు ఎక్కువగా ఉంటారు. అక్కడి భారతీయులు, పాకిస్థానీలు, బంగ్లావాసులు, లంకేయులు క్రికెట్‌ను ఆదరిస్తున్నారు. అందుకే అగ్రరాజ్యంపై నైట్‌రైడర్స్ కన్నేసింది. ఇప్పటికే ఆ సంస్థకు కరీబియన్ లీగులో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ ఉంది. ఈ ఏడాది ట్రోఫీని గెలిచింది. అంతే కాకుండా పాక్ మూలాలున్న అమెరికా పేసర్ అలీఖాన్ ఆ జట్టుకు ఆడటం గమనార్హం.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
