close

తాజా వార్తలు

Published : 27/09/2020 08:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జోరు కొనసాగించేదెవరు?

నేడు రాజస్థాన్‌తో పంజాబ్‌ ఢీ

తక్కువగా అంచనా వేస్తే ఎంతటి బలమైన జట్టుకు కూడా షాక్‌ ఇస్తామని నిరూపించింది రాజస్థాన్‌ జట్టు‌. పరుగుల వరద సృష్టించడమే కాదు.. బంతితోనూ సమష్టిగా అదరగొట్టి ప్రత్యర్థులను కట్టడి చేయగలమని చాటి చెప్పింది పంజాబ్‌ జట్టు‌. అండర్‌డాగ్స్‌గా టోర్నీలోకి బరిలోకి దిగి శుభారంభం చేసిన ఈ రెండు జట్లు మరో గెలుపుపై గురిపెట్టాయి. ఆదివారం షార్జా వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తమ జైత్రయాత్ర కొనసాగించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

బట్లర్‌తో మరింత బలం
చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో సారథి స్టీవ్ స్మిత్ సమయోచిత ఇన్నింగ్స్‌తో పరుగులు సాధిస్తే, యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌ సిక్సర్లతో విజృంభించాడు. ఆఖర్లో ఆల్‌రౌండర్‌ ఆర్చర్‌ కూడా సిక్సర్ల జల్లు కురిపించాడు. అయితే వీళ్లకి తోడుగా జట్లులోకి బట్లర్‌ వస్తున్నాడు. క్వారంటైన్‌ నిబంధనలు పూర్తిచేసుకుని పంజాబ్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. దీంతో జట్టు బ్యాటింగ్‌ బలం మరింత పెరగనుంది. ఈ నలుగురు నిలబడితే మరోసారి రాజస్థాన్‌ పరుగుల ప్రవాహం సృష్టించడం ఖాయం. అయితే బట్లర్‌ జట్టులోకి వస్తే మిల్లర్‌ తుది జట్టులో స్థానం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిల్లర్‌ తొలి మ్యాచ్‌లో ఖాతా తెరవకముందే రనౌటయ్యాడు.

రాహుల్ మరోసారి దంచితే..
పంజాబ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా ఎంతో బలంగా ఉంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో శతకంతో చెలరేగిపోయిన కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌తో పాటు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. కెప్టెన్‌గా, వికెట్‌కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా రాహుల్ అదరగొడుతున్నాడు. రాజస్థాన్‌ మ్యాచ్‌లో కూడా అతడి నుంచి మరో భారీ ఇన్నింగ్స్‌ను‌ అభిమానులు ఆశిస్తున్నారు. అయితే కోహ్లీసేనతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ మినహా ఎవరూ రాణించలేదు. ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ మాక్స్‌వెల్‌ గత రెండు మ్యాచ్‌ల్లోనూ రెండంకెల స్కోరుని చేయలేదు. అతడితో పాటు నికోలస్‌ పూరన్‌ కూడా అంచనాలను అందుకోలేదు. వీరిద్దరూ రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఫామ్‌లోకి రావాలని జట్టు ఆశిస్తోంది. 

బౌలింగ్‌లో పైచేయి ఎవరిదో?
షమి, కాట్రెల్‌తో పంజాబ్‌ పేస్‌ బలంగా ఉంది. రవి బిష్ణోయ్‌, మురుగన్‌ అశ్విన్‌.. తమ స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తున్నారు. వీరిద్దరూ కలిసి బెంగళూరు మ్యాచ్‌లో 7 ఓవర్లలోనే 6 వికెట్లు పడగొట్టారు. మరోవైపు రాజస్థాన్‌ పేస్‌ విభాగంలో ఆర్చర్‌ అదరగొడుతున్నాడు. డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. కానీ జయదేవ్, టామ్‌ కరన్‌ తొలి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే కరన్‌ను తుది జట్టులో కొనసాగిస్తూ జయదేవ్‌ స్థానంలో కార్తిక్‌ త్యాగి లేదా వరుణ్‌ ఆరోన్‌ను జట్టులోకి తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. ఇక చెన్నై మ్యాచ్‌లో కీలక వికెట్లు పడగొట్టిన రాహుల్ తెవాతియా నుంచి మరో గొప్ప ప్రదర్శనను ఆ జట్టు ఆశిస్తోంది.

10-9
ఇప్పటివరకు రాజస్థాన్‌, పంజాబ్‌ జట్ల మధ్య 19 మ్యాచ్‌లు జరిగాయి. అందులో 10 మ్యాచ్‌లు రాజస్థాన్‌ గెలవగా మిగిలినవి పంజాబ్‌ విజయం సాధించింది. అయితే చివరి అయిదు మ్యాచ్‌ల్లో రాహుల్‌సేనదే పైచేయి. నాలుగు మ్యాచ్‌ల్లో పంజాబ్‌ గెలిచింది.

జట్టు వివరాలు (అంచనా)

రాజస్థాన్‌: జైశ్వాల్‌, బట్లర్‌, సంజూ శాంసన్‌, స్టీవ్‌ స్మిత్ (కెప్టెన్‌), ఉతప్ప, రాహుల్ తెవాతియా, రియాన్‌ పరాగ్‌, టామ్‌ కరన్‌, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్‌ గోపాల్‌, కార్తిక్‌ త్యాగి/వరుణ్‌ ఆరోన్‌

పంజాబ్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్‌ అగర్వాల్‌, పూరన్, మాక్స్‌వెల్‌, కరుణ్‌ నాయర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌, షమి, కాట్రెల్‌

- ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.