close

తాజా వార్తలు

Updated : 24/09/2020 13:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జోరుమీదో జట్టు.. కసితో మరొకటి

నేడు బెంగళూరు, పంజాబ్‌ జట్ల మధ్య పోరు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరాజయాల పరంపరకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఈసారి తానూ టైటిల్‌ రేసులో ఉన్నానని ప్రత్యర్థులకు సంకేతాలు పంపించింది బెంగళూరు. తొలి మ్యాచ్‌లో విజయంతో కోహ్లీ సేన మంచి ఊపు మీద కనిపిస్తోంది. మరోవైపు.. తొలి మ్యాచ్‌లో విజయపుటంచుల వరకూ వచ్చి సూపర్‌ ఓవర్‌ రూపంలో ఓడిన పంజాబ్‌. అంపైర్‌ తప్పిదంతోనే మ్యాచ్‌ కోల్పోయామని భావిస్తున్న ఆ జట్టు కసితో రగిలిపోతోంది. ఈ రెండు జట్ల మధ్య నేటి సాయంత్రం ఉత్కంఠ పోరు సాగనుంది.

ఉమేశ్‌ ఒక్కడు రాణిస్తే..
బెంగళూరు జట్టు బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. యువ ఓపెనర్‌ పడిక్కల్ తొలి మ్యాచ్‌లో‌ అర్ధశతకం బాది అందరూ అవాక్కయ్యేలా చేశాడు. మిడిల్‌ఆర్డర్‌ యుజ్వేంద్ర చాహల్‌ సైతం అద్భుతంగా రాణించి జట్టు బౌలింగ్‌ విభాగంలో మరింత ఆత్మవిశ్వాసం నింపాడు. నవ్‌దీప్‌ సైని నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నాడు. ఇక ఫామ్‌ అందుకోవాల్సిందల్లా ఉమేశ్‌యాదవ్‌ ఒక్కడే. ఆ ఒక్కడు లయలోకి వస్తే ఆ జట్టుకు అడ్డుకోవడం కష్టమే. మరోవైపు.. తృటిలో మ్యాచ్‌ చేజార్చుకున్న పంజాబ్‌ కసిమీద రగిలిపోతోంది. ఆ జట్టును తక్కువ అంచనా వేస్తే బెంగళూరుకు ఇబ్బందులు తప్పవు.

మయాంక్‌కు తోడుగా నిలివాలి..
చూడటానికి గంభీరంగా ఉన్న పంజాబ్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో ఒక్క మయాంక్‌ అగర్వాల్‌ మినహా ఎవ్వరూ రాణించలేదు. కెప్టెన్ రాహుల్‌తో పాటు మ్యాక్స్‌వెల్‌, పూరన్‌ కూడా బ్యాట్‌ ఝులిపిస్తే పంజాబ్‌కు బోణీ విజయం సాధ్యమే. తొలి మ్యాచ్లో మహ్మద్‌ ‌ షమికి తోడుగా యువ స్పిన్నర్‌ రవిబిష్ణోయ్‌ ఇబ్బందులు పెట్టారు. విండీస్‌ పేసర్‌ కాట్రెల్‌ కూడా ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్‌పై ఎక్కువగా ఆధారపడే బెంగళూరును ఢీ కొట్టాలంటే పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు సంధించాల్సిన అవసరముంది.

రికార్డుల్లో సమవుజ్జీలు
ఇప్పటి వరకూ బెంగళూరు, పంజాబ్‌ మధ్య 24 మ్యాచ్‌లు జరిగాయి. అందులో చెరో 12 విజయాలు సాధించాయి. అయితే, చివరగా జరిగిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో బెంగళూరుదే పైచేయి. 2014లో దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 5 వికెట్ల తేడాతో కోహ్లీ సేనను ఓడించింది. రెండు జట్ల అత్యధిక స్కోరు చూస్తే.. పంజాబ్‌ 232 పరుగులు చేయగా.. బెంగళూరు 226 పరుగులు చేసింది.

జట్లు..
బెంగళూరు (అంచనా): కోహ్లీ(కెప్టెన్‌), ఆరోన్‌ ఫించ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, ఏబీ డివిలియర్స్‌, జోష్‌ ఫిలిప్ప్‌(వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, శివం దూబె, నవదీప్‌ సైని, ఉమేశ్‌యాదవ్‌, డేల్‌ స్టెయిన్‌, యుజ్వేంద్రచాహల్‌.

పంజాబ్‌(అంచనా): లోకేశ్‌ రాహుల్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ ‌నాయర్‌, క్రిస్‌ గేల్‌, సర్ఫరాజ్‌ఖాన్‌, మాక్స్‌వెల్‌, కృష్ణప్ప గౌతమ్‌, షెల్డన్‌ కాట్రెల్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, రవీ బిష్ణోయ్‌, మహమ్మద్‌ షమి.

ఎప్పటిలాగే ఈ మ్యాచ్‌లోనూ టాస్‌ గెలిచిన జట్టు కెప్టెన్‌ ఛేదనకు మొగ్గు చూపించే అవకాశాలున్నాయి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.