close

తాజా వార్తలు

పంత్‌ పరుగులు చేస్తే జట్టుకు కీలకం

టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌

చెన్నై: యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ పరుగులు చేయడం ఆరంభించగానే జట్టుకు కీలక సభ్యుడు అవుతాడని టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. అతడికి గొప్ప సామర్థ్య ఉందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు అతడిని ‘ఎక్స్‌’ ఫ్యాక్టర్‌గా భావిస్తున్నారని తెలిపాడు. ఫిట్‌నెస్‌, ఆటను మెరుగు పరుచుకొనేందుకు పంత్‌ కఠినంగా శ్రమిస్తున్నాడని వెల్లడించాడు.

‘ఇంతకుముందు ఈ ఫార్మాట్లో పంత్‌ రాణించాడు. పరుగులు చేయడం మొదలు పెడితే మ్యాచ్‌లు గెలిస్తాడు. అతడికి విశ్రాంతి ఇవ్వాల్సిన సమయం ఇంకా రాలేదు. కొన్ని అంశాలపై అతడు పనిచేస్తున్నాడు. నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడు. ఈ మధ్య టీ20ల్లో మేం చెప్పిన పని చక్కగా చేశాడు. జట్టు అతడి నుంచి అదే కోరుకుంటోంది’ అని రాఠోడ్‌ అన్నాడు. కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌, మానసిక ధోరణిలో కొన్ని మార్పులు చేశామని ఆయన తెలిపాడు. ‘అతనెప్పుడూ అద్భుతమైన ఆటగాడే. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి క్రికెటర్‌లాగే గడ్డుదశను అధిగమించాడు. కొన్ని సాంకేతిక మార్పులు, మానసిక ధోరణి మార్చుకున్నాడు’ అని రాఠోడ్‌ పేర్కొన్నాడు.

‘మయాంక్‌ అగర్వాల్‌ దేశవాళీ, భారత్‌-ఏ వన్డేల్లో అద్భుతంగా రాణించాడు. ఈ ఫార్మాట్లో అతడి సగటు 50కి పైగా ఉంది. ఈ ఏడాది విజయ్‌ హజారేలోనూ స్కోర్లు సాధించాడు. అతడు జట్టులో ఉండటం అందరికీ సంతోషమే. ఈ అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకుంటాడో చూడాలి. టాప్‌ ఆర్డర్‌ బాగా ఆడితే మిడిలార్డర్‌కు అవకాశాలు రావన్నది నిజమే. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాల్సిందే. ఛేదనలో టీమిండియా నంబర్‌వన్‌ జట్టు. మొదట బ్యాటింగ్‌ చేసినప్పుడు కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంది. ముంబయి టీ20లో ఆ ప్రయత్నం చేశాం’ అని రాఠోడ్‌ తెలిపాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.