close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 01/04/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

ఐపీఎల్‌ రద్దైతే క్రికెటర్లకు భారీ ఎఫెక్ట్‌

బీసీసీఐకీ రూ.వేల కోట్ల నష్టం అంటున్న ఫ్రాంఛైజీలు

దిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తొలుత ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15 వరకు వాయిదా వేసినా... దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో ఐపీఎల్‌ 13వ సీజన్‌ నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ఐపీఎల్‌ రద్దైతే ఒప్పందం మేరకు ఆటగాళ్లకు ఎటువంటి వేతనాలు చెల్లించేది లేదని ఓ ఫ్రాంఛైజీ సీనియర్‌ అధికారి స్పష్టం చేశారు. ‘‘ఐపీఎల్‌ చెల్లింపుల విధానం ప్రకారం సీజన్‌ ప్రారంభమయ్యే వారం రోజుల ముందు ఆటగాళ్లకు ఒప్పందంలో 15 శాతం డబ్బును చెల్లించాలి. టోర్నమెంట్‌ జరుగుతున్న సమయంలో మరో 65 శాతం చెల్లించాలి. మిగిలిన 20 శాతం టోర్నీ ముగిసిన తర్వాత నిర్ణీత సమయంలో ఇవ్వాలి. బీసీసీఐకి నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏ ఆటగాడికి పారితోషకాలు చెల్లించేది లేదు’’ అని అన్నారు.

మరో ఫ్రాంఛైజీ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘బీమా సంస్థ నిబంధనలో మహమ్మారి లేకపోవడంతో మాకు ఎటువంటి డబ్బులు రావు. వేతనాల కింద ఒక్కో ఫ్రాంఛైజీ రూ.75 నుంచి రూ.85 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్ జరగకపోతే మేం ఎలా చెల్లించగలం? ప్రముఖ ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగుల్లో కూడా ఆటగాళ్లకు ఇచ్చే పారితోషికంలో కోత విధించారు. ప్రస్తుత క్లిష్ట ఉన్న పరిస్థితులు సాధారణంగా ఎప్పుడూ మారతాయో చెప్పలేం. అయితే ఎంతో కష్టపడి వేలంలో ఎంపికైన ఎంతో మంది యువ క్రికెటర్లు ఐపీఎల్‌తో తమ జీవితాలు మారిపోతాయని ఆశించారు. బీసీసీఐ ఐపీఎల్‌ను నిర్వహించి వాళ్లకు దోహదపడుతుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఐపీఎల్‌ను నిర్వహించకపోతే బీసీసీఐ దాదాపు రూ.మూడు వేల కోట్లు నష్టపోతుందని భావిస్తున్నారు.

అయితే ఆటగాళ్ల పారితోషికాల్లో కోత గురించి ఇప్పటివరకు ఎటువంటి చర్చలు జరపలేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నష్టాలపై అంచనా వేయడం ఎంతో కష్టమని తెలిపారు. ఆఫీస్‌ బేరర్లతో చర్చించేవరకు దీనిపై స్పందించలేమని ఆయన వెల్లడించారు. మరోవైపు అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు దేశవాళీ క్రికెటర్లకు వేతనాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ఇండియన్ క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. బీసీసీఐకి క్రికెట్‌ నుంచి ఆదాయం వస్తుందని, క్రికెట్‌ జరగకపోతే వారికి ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. దీంతో అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు దేశవాళీ ఆటగాళ్లకు ఎఫెక్ట్ ఉంటుందని అన్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.