
తాజా వార్తలు
కోహ్లీ లేకుండా గెలిస్తే ఏడాది సంబరాలు..
ఇంటర్నెట్‌డెస్క్: కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకున్నా టీమ్ఇండియా టెస్టు సిరీస్ గెలిస్తే ఏడాది పాటు సంబరాలు చేసుకోవచ్చని ఆస్ట్రేలియా మాజీ సారథి మైఖేల్ క్లార్క్ అన్నాడు. తాజాగా అతడు ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ స్థానాన్ని ఎవరూ భర్తి చేయలేరని, కానీ కేఎల్ రాహుల్ ఆ స్థానంలో బాగా ఆడతాడని పేర్కొన్నాడు. ‘విరాట్ కోహ్లీకి రెండు బాధ్యతలున్నాయి. ఒకటి కెప్టెన్సీ, రెండోది బ్యాటింగ్. అయితే, అతడి స్థానంలో రాహుల్ బాగా ఆడగలడు. అతడెంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇంతకుముందు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం కూడా ఉంది. దాంతో ఈసారి రాణించగలడు’ అని క్లార్క్ వివరించాడు.
‘అయితే, కోహ్లీ స్థానాన్ని ఎవరూ భర్తి చేయలేరు. అజింక్య రహానె అంటే నాకిష్టం. అతడో గొప్ప ఆటగాడు. కెప్టెన్సీ సైతం బాగా చేస్తాడు. వ్యూహాత్మకంగానూ మెరుగైన సారథి. అది టీమ్ఇండియాకు ఉపయోగకరం. కోహ్లీ ఆడకపోవడాన్ని అవకాశంగా పరిగణించాలి. అక్కడ బాగా రాణించడానికి ప్రయత్నించి చరిత్ర సృష్టించాలి. ఒకవేళ కోహ్లీ లేకుండానే టీమ్ఇండియా ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డ మీద ఓడిస్తే ఏడాది పాటు సంబరాలు చేసుకోవచ్చు. అది నమ్మశక్యం కాని విజయంగా మారుతుంది’ అని క్లార్క్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, టీమ్ఇండియా ఇప్పటికే రెండు వన్డేల్లో ఓటమిపాలై ఈ సిరీస్‌ను కోల్పోయింది. కోహ్లీ ఉన్నా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అతడు లేకుండా టెస్టు సిరీస్ గెలవడమంటే కష్టమనే చెప్పాలి. మరి రాబోయే మ్యాచ్‌ల్లో అయినా విజయాలు సాధించి టెస్టు సిరీస్‌పై నమ్మకం కలిగించే బాధ్యత కోహ్లీసేనపైనే ఉంది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- ముక్క కొరకలేరు!
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
