close

తాజా వార్తలు

ఎంఎస్‌ ధోనీ రిటైర్ కాడు: డ్వేన్‌ బ్రావో

ముంబయి: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలకడని వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు డ్వేన్‌బ్రావో అంటున్నాడు. అతడు వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ కచ్చితంగా ఆడతాడని ధీమా వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌లో మహీ సారథ్యంలో బ్రావో ఆడిన సంగతి తెలిసిందే. విండీస్‌ బోర్డులో సానుకూల మార్పులతో అతడు తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేస్తున్న సంగతి తెలిసిందే.

‘ధోనీ ఎప్పటికీ వీడ్కోలు పలకడు. అందుకే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఆడతాడనే అనుకుంటున్నా. మైదానం బయట జరిగే సంఘటనల ప్రభావం తనపై ఉండనివ్వడు. మాకూ అదే నేర్పాడు. ఎప్పుడూ భయపడొద్దని, సామర్థ్యంపై నమ్మకం ఉంచాలని చెప్పేవాడు’ అని బ్రావో అన్నాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు త్వరలో పునరాగమనం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించాడు.

‘శారీరకంగా బాగున్నాను. ఇంకా ఆడగలను. మైదానం ఆవల రాజకీయాలతో వీడ్కోలు పలికాను. ప్రస్తుతం మైదానంలో, బయటా నాయకత్వ మార్పులు జరిగాయి. పునరాగమనానికి ఇదే మంచి సమయం. జట్టులో యువకులు, ప్రతిభావంతులు ఉన్నారు. రసెల్‌, నరైన్‌ వంటి సీనియర్లు రానున్నారు. మేం మళ్లీ ప్రపంచ విజేతగా అవతరించగలం. పొలార్డ్‌ అందరిలో స్ఫూర్తి నింపుతున్నాడు. కోచ్‌ సిమ్మన్స్‌ యువకులకు స్వేచ్ఛనిచ్చాడు. నిర్భీతిగా క్రికెట్‌ ఆడే పరిస్థితులు కల్పించారు. బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు బాగున్నారు. కావాల్సిందల్లా మంచి మార్గనిర్దేశం. టీ20 ప్రపంచకప్‌నకు ఏడాది సమయం ఉంది కాబట్టి దానికి సన్నద్ధం కాగలను. నేను ప్రశాంతంగా ఉంటాను. ఒత్తిడి నన్ను ఇబ్బంది పెట్టదు. టీ20ల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రశాంతత చాలా అవసరం’ అని బ్రావో అన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.