close

తాజా వార్తలు

Published : 02/10/2020 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెన్నై జట్టుకు సమస్యలన్నీ అందుకే: ఇర్ఫాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: యూఏఈలో జరుగుతున్న 13వ సీజన్‌లో చెన్నై జట్టు వైఫల్యాలకు కారణం.. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా దూరమైనా ఇంకా ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకోలేకపోవడమేనని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు సంజయ్‌ బంగర్‌తో కలిసి క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. టోర్నీ ఆరంభమైనా చెన్నై ఇంకా కుదురుకోలేదని, అలా జరగడం ఇదే తొలిసారని పఠాన్‌ అన్నాడు. సీజన్‌ ఆరంభానికి ముందే చెన్నై సమస్యలతో ఉందని, అలాగే రైనా తిరిగి వెళ్లిపోయినా ఇంకా ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకోలేదని గుర్తుచేశాడు. ఈ కారణంగానే ధోనీ జట్టులో అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పాడు. 

‘ఒకవేళ రైనా ఆడి ఉంటే చెన్నై మరో అదనపు బౌలర్‌ను ఎంచుకునేది. ఇప్పుడైతే ఐదుగురు బౌలర్లే ఉన్నారు. అయితే, కేదార్‌ జాదవ్‌కు ధోనీ బౌలింగ్‌ ఇవ్వకపోవడం గమనించాల్సిన విషయం. ఈ సీజన్‌లో అదనపు బౌలర్లు ఉన్న జట్లు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే ధోనీ మంచి ఫినిషర్‌ కోసం ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే అతడే అత్యుత్తమ ఫినిషర్‌. అతడు 10 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయగలగడంతో పాటు ఒక అదనపు బౌలర్‌ను తీసుకుంటే అన్ని సమస్యలూ సర్దుకుపోతాయి’ అని ఇర్ఫాన్‌ వివరించాడు.  ఇదిలా ఉండగా, చెన్నై ఈ సీజన్‌లో ముంబయితో ఆరంభపోరులో విజయం సాధించగా తర్వాత రాజస్థాన్‌, దిల్లీ చేతుల్లో ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. శుక్రవారం హైదరాబాద్‌తో తలపడనుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.