close

తాజా వార్తలు

Published : 05/08/2020 11:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వారెవ్వా.. ఇంగ్లాండ్‌ను బోల్తా కొట్టించిన ఐర్లాండ్‌

శతకాలతో చెలరేగిన స్టిర్లింగ్‌, బాల్బిర్నీ

సౌథాంప్టన్‌: వన్డే ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టును పసికూన ఐర్లాండ్‌ ఓడించింది. మంగళవారం అర్థరాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ సంచలనం సృష్టించింది. 329 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక బంతి మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేందించింది. టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ పాల్‌ స్టిర్లింగ్‌(142; 128 బంతుల్లో 9x4, 6x6), కెప్టెన్‌ ఆండ్రూ బాల్బిర్నీ(113; 112 బంతుల్లో 12x4) శతకాలతో చెలరేగిపోవడంతో ఆ జట్టు విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఐర్లాండ్‌ ఆది నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టింది. 

అయినా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(106; 84 బంతుల్లో 15x4, 4x6), టామ్‌ బాంటన్‌(58; 51 బంతుల్లో 6x4, 1x6), విల్లీ(51; 42 బంతుల్లో 3x4, 3x6) రాణించడంతో ఆ జట్టు 49.5 ఓవర్లలో 328 పరుగులు చేసి ఆలౌటైంది. క్రేగ్‌ యంగ్‌ 3, జాషువా లిటిల్‌ 2, కాంఫర్‌ 2 రెండు వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లాండ్‌ బౌలర్లు తేలిపోవడంతో ఐర్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ రెచ్చిపోయారు. దీంతో చివరి మ్యాచ్‌ గెలిచి ఆ జట్టు పరువు దక్కించుకుంది. అంతకుముందు జరిగిన తొలి రెండు వన్డేల్లో ఇంగ్లాండ్‌ గెలుపొంది సిరీస్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.