Tokyo Olympics: సెమీస్‌కు దూసుకెళ్లిన పురుషుల హాకీ జట్టు

తాజా వార్తలు

Updated : 01/08/2021 19:49 IST

Tokyo Olympics: సెమీస్‌కు దూసుకెళ్లిన పురుషుల హాకీ జట్టు

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుషుల జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3-1 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ ప్రారంభమైనప్పటి నుంచి భారత జట్టు బ్రిటన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడింది. గోల్‌ చేయనీకుండా అడ్డుకుంది. ఫలితంగా భారత్‌ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకొని సెమీస్‌లోకి అడుగుపెట్టింది. 

మ్యాచ్‌ తొలి క్వార్టర్‌లో ఏడో నిమిషంలో దిల్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌ చేయగా.. రెండో క్వార్టర్‌లో 16వ నిమిషంలో గుర్జత్‌సింగ్‌ మరో గోల్‌ సాధించాడు. దీంతో మ్యాచ్‌ విరామ సమయానికి భారత్‌ 2-0 గోల్స్‌ ఆధిక్యంతో కొనసాగింది. 45వ నిమిషంలో బ్రిటన్‌ తొలి గోల్‌ చేసింది. దీంతో మూడో క్వార్టర్‌ పూర్తయ్యేసరికి బ్రిటన్‌ ఒక గోల్‌ చేసి స్కోర్‌ 2-1గా మార్చింది. నాలుగో క్వార్టర్‌లో 57వ నిమిషంలో హార్దిక్‌ సింగ్‌ మూడో గోల్‌ చేసి భారత్‌ జట్టు ఆధిక్యాన్ని పెంచాడు.  

41 ఏళ్ల తర్వాత.. 

మొదట్లో భారత హాకీ జట్టు ప్రపంచంలోనే మేటి జట్టుగా ఉండేది. గతంలో జరిగిన ఒలింపిక్స్‌లో మొత్తం 8 స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్య పతకాలు అందుకున్న భారత హాకీ జట్టు.. 1980లో చివరిసారి స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాత జట్టు కళ తప్పింది. అప్పటి నుంచి ఒలింపిక్స్‌లో పూల్‌, క్వార్టర్‌ఫైనల్‌లో ఓడిపోయి వెనుదిరిగేది. తాజాగా క్వార్టర్‌ ఫైనల్‌లో గెలుపొందడంతో 41 ఏళ్ల తర్వాత తొలిసారి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆగస్టు 3న సెమీ ఫైనల్‌లో బెల్జియంతో భారత్‌ తలపడనుంది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని