close

తాజా వార్తలు

దాదాకు ఇష్టమైన సినిమా, నటుడు, పాత్ర ఇవే

కోహ్లీ, శాస్త్రితో కొన్ని ఆలోచనలు పంచుకుంటా: గంగూలీ

కోల్‌కతా: ప్రపంచకప్‌లో పోటీపడే కోహ్లీసేనపై తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. త్వరలోనే వాటిని సారథి విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి, జట్టు యాజమాన్యంతో పంచుకుంటానని వెల్లడించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌ను గెలవడమే తమ అంతిమ లక్ష్యమని దాదా స్పష్టం చేశారు. శర్మిష్ఠ గోప్తూ రచించిన ‘మేనకా హ్యాజ్‌ హ్యాంగ్‌డ్‌ హర్‌సెల్ఫ్‌’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన మీడియాతో సరదాగా మాట్లాడారు.

‘టీ20 క్రికెట్లో మేం బాగా లక్ష్యాలను ఛేదిస్తున్నామంటే తొలుత బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడూ అదే చేయగలం. నా వద్ద కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని విరాట్‌, రవి, జట్టు యాజమాన్యంతో పంచుకుంటాను. ప్రస్తుతం టీమిండియా ఎక్కువ టీ20లు ఆడలేదు. ప్రపంచకప్‌ వరకు కోహ్లీసేన సిద్ధంగా ఉంటుంది’ అని దాదా అన్నారు. తన ఆలోచనలు ఏమిటో ఆయన మీడియాకు చెప్పలేదు. ‘విదేశాల్లో నిలకడగా రాణించడమే మా అంతిమ లక్ష్యం. గతేడాది ఆస్ట్రేలియాలో అద్భుతంగా రాణించాం. మళ్లీ ఆసీస్‌, న్యూజిలాండ్‌పై అదరగొట్టే జట్టు మాకుంది. టెస్టుల్లో ప్రపంచ నంబర్‌వన్‌గా అదే మా లక్ష్యం’ అని గంగూలీ వెల్లడించారు.

పుస్తకావిష్కరణ తర్వాత తన ఇష్టాఇష్టాలను దాదా తెలిపారు. ‘షోలే’ చిత్రం తన ఆల్‌టైం ఫేవరెట్‌ అన్నారు. సినిమాల్లోనైతే ఏ పాత్ర పోషిస్తారని ప్రశ్నించగా.. ‘కఠినమైన ప్రశ్న. నేను నటించగలనని అనుకోను. షోలేలో అమితాబ్‌ పాత్ర, గబ్బర్‌సింగ్‌ పాత్ర ఇష్టం. వాటిని నేను పోషించలేను. సత్యజిత్‌ రే చిత్రాల్లోని సౌమిత్ర ఛటోపాధ్యాయ విభిన్న పాత్రలు నాకిష్టం. ఆ ఒక్కటే కాదు రే చిత్రాల్లోని పాత్రలన్నీ అద్భుతంగా ఉంటాయి. ఒత్తిడి, కుంగుబాటు నుంచి సినిమాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి. అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌, హృతిక్‌, ఆమిర్‌, బెంగాల్లో సౌమిత్ర బాబు, ప్రసేన్‌జిత్‌ ఛటర్జీ, అబిర్‌ ఛటర్జీ మంచి నటులు. ప్రతిఒక్కరి పేరు చెప్పలేకపోయినందుకు క్షమించండి’ అని గంగూలీ అన్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.