
తాజా వార్తలు
అవును.. స్మిత్ చెప్పింది అక్షరాల నిజం
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్ చెప్పిన మాటలు అక్షరాల నిజమని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే ఆ జట్టు రెండు మ్యాచ్‌లు గెలుపొంది సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రెండు వన్డేల్లో స్మిత్ శతకాలు బాది జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇదే విషయంపై టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఈఎస్పీఎన్తో మాట్లాడుతూ ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతడెంతో దూరంలో లేడని చెప్పాడు.
‘టీమ్ఇండియాను స్మిత్ అర్థం చేసుకున్నాడు. కానీ, టీమ్ఇండియా అతడిని అర్థం చేసుకోలేకపోయింది. అయితే, తొలి మ్యాచ్‌కు ముందు లయ అందుకున్నానని అతడు చెప్పిన మాటలు అక్షరాల నిజం. కేవలం 18 ఓవర్లలోనే శతకం పూర్తి చేసుకున్నాడు. 20వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ 38వ ఓవర్లోనే మూడంకెల స్కోర్ అందుకున్నాడు. ఆ సమయంలో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. వన్డే ఫార్మాట్లో టీమ్ఇండియా సారథి అత్యుత్తమ ఆటగాడు. కానీ, అతడిని చేరుకోడానికి స్మిత్ ఎంతో దూరంలో లేడు. వరుస మ్యాచ్‌ల్లో 18 ఓవర్లలోనే శతకాలు సాధించడం మాటలు కాదు. కోహ్లీ గణంకాలు ఎంత మెరుగ్గా ఉన్నా ఈ రెండు మ్యాచ్‌ల్లో స్మిత్ ఆడిన తీరు, అతడు చూపించిన ప్రభావం నమ్మశక్యం కానిది’ అని గంభీర్ మెచ్చుకున్నాడు.
స్మిత్ ఇలాగే కొనసాగితే టీమ్ఇండియాకు కష్టాలు తప్పవని, మూడో వన్డేలోనూ అతడు చెలరేగే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. సుదీర్ఘ పర్యటనలో ఇది ఆరంభమేనని, స్మిత్‌ను ఔట్ చేసే విధానం కనుక్కోపోతే టీమ్ఇండియాకు కష్టమని అన్నాడు. అతడు పరుగుల దాహంతో ఉన్నాడని, ఇదే ఫామ్‌తో టెస్టు సిరీస్‌లో చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. ఇదిలా ఉండగా, ఇరు జట్లు బుధవారం మూడో వన్డే ఆడనున్నాయి. ఆపై 3 టీ20ల సిరీస్ జరగనుండగా డిసెంబర్ 17 నుంచి 4 టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
