
తాజా వార్తలు
రైతుల ఆందోళన: మళ్లీ అవార్డు వాపసీ!
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు కొందరు మాజీ క్రీడాకారులు మద్దతు ప్రకటించారు. అన్నదాతలపై జల ఫిరంగులు, బాష్పవాయు గోళాల ప్రయోగాన్ని వ్యతిరేకించారు. ఇందుకు నిరసనగా తమకు అందించిన పద్మశ్రీ, అర్జున అవార్డులను తిరిగిచ్చేస్తామని మాజీ రెజ్లర్ కర్తార్‌సింగ్, బాస్కెట్ బాల్ ఆటగాడు సజ్జన్ సింగ్ చీమా, హాకీ క్రీడాకారుడు రాజ్బీర్ కౌర్ హెచ్చరించారు. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్ బయట పురస్కారాలను వదిలేస్తామని పేర్కొన్నారు.
‘మేం రైతు బిడ్డలం. కొన్ని నెలలుగా వారు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. హింసకు పాల్పడ్డ ఒక్క సందర్భం లేదు. కానీ వారు దిల్లీకి వెళ్తుంటే జల ఫిరంగులు, బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తున్నారు. మా పెద్దల తలపాగాలు కిందపడితే ఈ పురస్కారాలతో మేం ఏం చేసుకుంటాం? మేం రైతులకు మద్దతు ఇస్తున్నాం. ఆ అవార్డులు మాకు అవసరం లేదు. అందుకే తిరిగి ఇచ్చేస్తున్నాం. రైతులే చట్టాలు వద్దంటుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు రుద్దుతోంది’ అని క్రీడాకారులు ప్రశ్నించారు. దిల్లీలో రైతుల ఆందోళన మంగళవారానికి ఆరో రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ముక్క కొరకలేరు!
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
