close

తాజా వార్తలు

ఆత్మవిశ్వాసం పెరిగితే దూబె అద్భుతం

చెన్నై: అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదిగే సామర్థ్యం... యువకుడైన శివమ్‌ దూబెకు ఉందని టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్ అన్నాడు. మ్యాచ్‌లు ఆడేకొద్దీ అతడిలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తోందని వెల్లడించాడు. తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో అతడు 30 బంతుల్లో 54 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.

‘దూబె ఉత్సాహవంతుడు. ప్రతి మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసం పెంచుకుంటున్నాడు. ముంబయిలో విండీస్‌పై తొలి ఓవర్‌ వేసిన తర్వాత అతడు పుంజుకున్న విధానం ప్రశంసించదగింది. అతడిపై కోహ్లీ విశ్వాసం ఉంచాడు. చాలా ప్రతిభావంతుడు. ఆత్మవిశ్వాసం పొందే కొద్దీ మంచి ఆల్‌రౌండర్‌ అవుతాడు’ అని అరుణ్‌ అన్నాడు. యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌ను ఆయన ప్రశంసించాడు. ‘ఐపీఎల్‌లో దీపక్‌ అద్భుతంగా రాణించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయగలడు. తెలివైన వాడు. నెమ్మదైన బౌన్సర్లు, యార్కర్లు వేయగలడు. అంతర్జాతీయ స్థాయికి కావాల్సినవన్నీ అతడిలో ఉన్నాయి. జట్టు సమతూకం గురించి ఆలోచిస్తున్నాం. జడ్డూను ఆల్‌రౌండర్‌గా ఉపయోగించుకోగలం. అవసరమైనప్పుడు కుల్‌దీప్‌, చాహల్‌ ఇద్దరినీ ఆడిస్తున్నాం’ అని ఆయన వెల్లడించాడు.

విండీస్‌ను వన్డేల్లోనూ టీమిండియా బౌలర్లను నిలువరించగలరని భరత్‌ తెలిపాడు. అందుకు అవసరమైన బౌలర్లు తమకు ఉన్నారన్నాడు. ‘ఎక్కువ మంది బౌలర్లు రాణిస్తే జట్టుకు మంచిది. ఎంచుకోవడానికి ఎక్కువ వనరులు ఉంటాయి. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వాతావరణం, పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని బౌలర్లను తీసుకుంటాం. జడేజా రెడీమేడ్‌ ఆల్‌రౌండర్‌. ప్రపంచకప్‌లో బాగా ఉపయోగపడ్డాడు. అద్భుతంగా బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌ చేశాడు. వాషింగ్టన్‌ సుందర్‌ కచ్చితంగా వన్డేల్లోకి వస్తాడు. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని అతడు ఉపయోగించుకుంటున్నాడు. సామర్థ్యానికి మించి అతడు బ్యాటింగ్‌ చేయగలడు’ అని భరత్‌ అరుణ్ పేర్కొన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.