close
Array ( ) 1

తాజా వార్తలు

ఐపీఎల్‌ 2020: గెలుపు గుర్రాలు భారతీయులే

దిల్లీ: దిల్లీ క్యాపిటల్స్‌లోని కీలకమైన భారత బృందం యువకులు, సీనియర్లతో కళకళలాడుతోందని పేసర్‌ మోహిత్‌ శర్మ అన్నాడు. ఐపీఎల్‌ తాజా సీజన్‌లో విజయాలకు వీరి ఆటే కీలకమని వెల్లడించాడు. ప్రస్తుతం ఆ జట్టులో మోహిత్‌ సహా శ్రేయస్‌ అయ్యర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శిఖర్‌ ధావన్‌, పృథ్వీషా, అజింక్య రహానె, రిషభ్‌ పంత్‌, ఇషాంత్‌ శర్మ, అమిత్‌ మిశ్రా ఉన్న సంగతి తెలిసిందే.

‘ఐపీఎల్‌ గెలవాలంటే జట్టులోని భారత ఆటగాళ్ల ప్రదర్శనే అత్యంత కీలకం. ఈ సీజన్‌కు సంబంధించి దిల్లీ క్యాపిటల్స్‌లోనే కీలకమైన భారత క్రికెటర్ల బృందం ఉంది. యువకులు, అనుభవజ్ఞులతో సమతూకంగా కనిపిస్తోంది. గతేడాది ఇతర ఫ్రాంచైజీలు దిల్లీనే పటిష్ఠ జట్టుగా భావించాయి. యువ ఆటగాళ్ల వల్లే ఆ నమ్మకం. ఈ సారి మేం మరింత మెరుగ్గా రాణించగలం’ అని మోహిత్‌ అన్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో దిల్లీ అతడిని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.

‘పదహారేళ్ల వయసు నుంచి నేను కోట్లాలో ఆడుతున్నా. దిల్లీ క్యాపిటల్స్‌ నన్ను కొనుగోలు చేసినప్పుడు ఎట్టకేలకు సొంత జట్టుకు ఆడబోతున్నానని అనిపించింది’ అని మోహిత్‌ తెలిపాడు. శస్త్రచికిత్స జరగడంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్‌ పొందేందుకు అతడు సాధన చేస్తున్నాడు. దిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాని వెల్లడించాడు. ‘మెరుగైన మార్గనిర్దేశం నా కెరీర్‌ను మారుస్తుందనే దశలో ఉన్నాను. రికీ పాంటింగ్‌, మిగతా సిబ్బంది నుంచి నేర్చుకొనేందుకు ఎదరుచూస్తున్నాను’ అని అతడు చెప్పాడు.

రంజీ 2012-13 సీజన్‌తో వెలుగులోకి రావడంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ మోహిత్‌ను తీసుకుంది. రావడంతోనే అతడు 15 మ్యాచుల్లో 20 వికెట్లు తీసి దుమ్మురేపాడు. ఆ తర్వాత సీజన్లో 23 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. 2016 నుంచి 2018 వరకు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఆడాడు. 2019లో తిరిగి చెన్నై కొనుగోలు చేసింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.