2020 వరకే కష్టాలు..పర్యావరణాన్ని కాపాడుదాం

తాజా వార్తలు

Published : 15/11/2020 03:04 IST

2020 వరకే కష్టాలు..పర్యావరణాన్ని కాపాడుదాం

ఇంటర్నెట్‌డెస్క్: సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు క్రీడాకారులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ దీపావళికి టపాసులకు దూరంగా ఉంటూ పర్యావరణాన్ని కాపాడుకుందామని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ట్విటర్‌లో అభిమానులకు కోరాడు. బీసీసీఐ అధ్యక్షడు సౌరవ్ గంగూలీ, మాజీ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతం గంభీర్‌, సురేశ్‌ రైనా, యువరాజ్‌‌ సింగ్‌, ప్రస్తుత క్రికెటర్లు రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, డేవిడ్‌ వార్నర్‌, మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్‌, స్మృతి మంధాన కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 2020లోని కష్టాల్ని వెలుగుల పండగ దూరం చేసి అందరికీ ఆనందాన్ని కలిగిస్తుందని గంభీర్‌ పేర్కొన్నాడు. దీపావళి సందర్భంగా ఆటగాళ్లు పోస్ట్‌లు మీ కోసం.. 
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని