close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/02/2020 06:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లంచ్‌ విరామానికి భారత్‌ 85/2

క్రైస్ట్‌చర్చ్‌: హాగ్లీ ఓవల్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ను భారత్‌ ప్రతిఘటిస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఆదిలోనే ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ (7, 11 బంతుల్లో; 1×4)ను బౌల్ట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 30 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కివీస్‌కు భారత్ అవకాశం ఇవ్వలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా (15*)తో కలిసి పృథ్వీ షా (54, 64 బంతుల్లో; 8×4, 1×6) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.  ఫోర్లు, సిక్సర్లతో వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేశాడు. 47 పరుగులు వద్ద ఉన్నప్పుడు వాగ్నెర్ బౌలింగ్‌లో ఫైన్‌లెగ్‌ మీదుగా సిక్సర్‌ బాది 60 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత పృథ్వీ షా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. జేమీసన్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి స్లిప్‌లో ఉన్న లేథమ్‌ చేతికి చిక్కాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ (3*)తో కలిసి పుజారా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. లంచ్‌ విరామ సమయానికి  భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.